Advertisement
Google Ads BL

దిల్ రాజుకి స్ట్రయిట్ కథలే దొరకడం లేదా?


టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకి రీమేకుల పిచ్చి పట్టింది. ఆ పిచ్చి అలాంటి ఇలాంటి పిచ్చి కాదు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి క్లాసిక్ హిట్ గా నిలిచిన 96 రీమేక్ రైట్స్ కొన్న దగ్గర నుండి నిన్న ట్రైలర్ లాంచ్ వరకు 96 పై తనకున్న మోజును చెబుతూనే ఉన్నాడు. తెలుగులో సమంతనే హీరోయిన్ గా 96 రీమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యి సమంత వెనకాల పడి మరీ ఒప్పించాడు. 96 రీమేక్ కొన్న చానళ్లకు కానీ సమంతని ఒప్పించగలిగాడు. సమంత అయితే ఏకంగా దిల్ రాజుకి దొరక్కుండా తనకి హెల్త్ బాలేదని అబద్దాలు కూడా చెప్పించింది. అయినా దిల్ రాజు వదలకుండా సమంతని తీసుకొచ్చాడు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా పవన్ విషయము అంతే. పవన్ కళ్యాణ్ తో ఎలాగైనా సినిమా చెయ్యాలని చూసి ఆయన్ని పింక్ రీమేక్ కోసం ఒప్పించాడు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్, తమిళ పింక్ రీమేక్ సూపర్ హిట్. అలాంటి సినిమాని ఇక్కడ ఎవరు చూస్తారు అనేది ఆలోచించకుండా పవన్ కోసం పింక్ రైట్స్ కొన్నాడు. పవన్ ఓ గంట టైం ఇచ్చినా  అదే ప్రసాదం అంటూ పవన్ కళ్యాణ్ డేట్స్ ని వాడుకుంటున్నాడు. మరి దిల్ రాజు సినిమా అంటేనే పిచ్చ ఆసక్తి ఉంటుంది. అయితే దిల్ రాజు ఇప్పుడు తీసుకున్న రెండు సినిమా రీమేక్ రైట్స్ సినిమాల విషయంలో ప్రేక్షకుల నుండి పెద్దగా క్యూరియాసిటీ కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడో వీక్షించేసారు మరి. కారణం బ్లాక్ బస్టర్ సినిమాలు కాబట్టి. అందుకే తెలుగులో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయినా దిల్ రాజు కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు.

Dil Raju Interests on Remakes:

Dil Raju Daring Decisions about Remakes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs