ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేకి ఇంతవరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేదనే చెడ్డపేరుని అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తో చెరిపేసుకుంది. అల వైకుంఠపురములో మేడం అమూల్యగా అందాల ఆరబోతతో ఆకట్టుకుంది. అలాగే సినిమా సక్సెస్ లో భాగస్వామి అయ్యింది. హిట్స్ లేనప్పుడే స్టార్ హీరోల సినిమాలతో చెలరేగిపోయిన పూజా హెగ్డే అల వైకుంఠపురములో హిట్ మంచి బూస్ట్ ఇవ్వడమే కాదు.. మరో రెండు మూడేళ్లు అమ్మడుని ఫుల్ బిజీగా ఉంచే అవకాశం ఇచ్చింది. ఇక పూజా హెగ్డే హైట్ ఎక్కువైనా సన్నగా నాజూగ్గా గ్లామరస్ గా మతులు పోగొడుతుంది. అయితే అమ్మడుకి బాడీలో ఎక్కడా ఫ్యాట్ లేకపోయినా పొట్ట దగ్గర మాత్రం కాస్త కొవ్వు ఎక్కువే. అందుకే బొడ్డు కింద నాభి అందాలను రివీల్ చెయ్యకుండా జాగ్రత్త పడే పూజా హెగ్డే జిమ్ లో వర్కౌట్స్ తో ఎప్పుడూ ఫిట్ గానే ఉంటుంది.
అయితే అమ్మడుకు తన పొట్ట మీద వస్తున్న కామెంట్స్ చూసాక మరింత జిమ్ చేసి పొట్ట దగ్గర కొవ్వు కరిగించి మంచి షేప్ కోసం ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా ఈ పై ఫోటో చూస్తే తెలుస్తుంది. జిమ్ లో బాడీని రబ్బరులా ఎటు కావాలంటే అటు వంగ దీసి ఎక్సరసైజ్ చేస్తుందో? లేదంటే జిమ్ యోగ లాంటిదేమన్నా ట్రై చేస్తుందో తెలియదు కానీ.. పూజా ఇచ్చిన ఈ లేటెస్ట్ జిమ్ భంగిమ మాత్రం అదిరింది. జిమ్ డ్రెస్ లా బిగుతుగా ఉన్న డ్రెస్ కాకుండా కాస్త ఫుల్ హాండ్స్, పొట్టినిక్కరుతో కలిపివేసిన షర్ట్ తో పూజా రెండు చేతులు పైకిపెట్టి కాళ్ళను అటొకటి ఇటొకటి చాపి ఇచ్చిన క్లిష్టమైన ఫోజ్ చూసిన వారికీ పూజా ఎంతగా కష్టపడుతుందో తెలుస్తుంది. మరి అభిమానులను అబ్బుర పరచాలన్నా స్టార్ హీరోలను మరికొంతకాలం పడెయ్యాలన్నా ఈ మాత్రం కష్టం అవసరమే.