గత ఏడాది బాలయ్య కెరీర్లో మూడు డిజాస్టర్లు పడ్డాయి. ఒకదానికి మించి మరోటి అన్నట్టుగా వరుస పరాజయాలు చవి చూశాడు. ఏడాది ప్రారంభంలో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు సహా ఏడాది చివర్లో వచ్చిన "రూలర్" చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయాలుగా నిలిచాయి. అయితే ఎన్టీఆర్ జీవిత చరిత్రని పక్కన పెడితే, చివర్లో వచ్చిన చిత్రం రూలర్ మాత్రం అనేక విమర్శలకి గురైంది.
చాలా పాత కథతో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. అయితే ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రనాభినయం చేశాడు. ఒక పాత్రలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేయగా, మరో పాత్రలో పోలీస్ ఆఫీసరుగా కనిపించాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా బాలయ్య లుక్ ఫర్వాలేదనిపించినా, పోలీస్ ఆఫీసరు పాత్రలో బాలయ్య లుక్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆ పాత్రకి బాలయ్య వాడిన విగ్గు అస్సలు సెట్ కాలేదని అన్నారు.
సోషల్ మీడియాలో ఆ విగ్గు గురించి చర్చ బాగానే నడిచింది. అది బాలయ్య వరకి వెళ్ళినట్టుంది. ఇక నుండి విగ్గు మీద ఫుల్ కాన్ సన్ ట్రేషన్ చేసినట్టున్నాడు. ఇక నుండి తన సినిమాల్లో విగ్గు అవసరమే లేకుండా చేయాలని డిసైడ్ అయ్యాడట. అంటే అర్థం కాలేదా... బాలయ్య హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నాడట. దుబాయ్ లో చాలా ఎక్కువ ఖర్చు పెట్టి మరీ చేయించుకుంటున్నాడని సమాచారం.
దీనికోసమే బాలయ్య ఇప్పుడు గుండు చేసుకుని కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే బాలయ్య బోయపాటి సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి మరింత సమయం పట్టేలా ఉంది.