Advertisement
Google Ads BL

శర్వా, సామ్‌ల ‘జాను’ కొత్తగా ఉండదు కానీ..!


టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌ సమంత - కుర్ర హీరో శర్వానంద్ కలయికలో తెరకెక్కుతున్న ‘జాను’ ట్రైలర్ వచ్చేసింది. ‘96’ రీమేక్ ‘జాను’ సినిమా ట్రైలర్ చూడాలని అందరిలో పిచ్చ ఆసక్తి. ఎందుకంటే సూపర్‌హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు లాంటోడు వెంటబడి మరీ కొనుక్కొచ్చిన ‘96’ రీమేక్ రైట్స్ అలాంటి ‘జాను’ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ. అయితే తమిళంలో 96 వీక్షించేసిన ప్రేక్షకులకు జాను కొత్తగా ఉండదు కానీ.. జానూ సినిమాని మొదటిసారి చూస్తే మాత్రం గుండె జారిపోవాల్సిందే. అంత హార్ట్ టచింగ్ గా వుంది. సమంత నటన, శర్వానంద్ లుక్స్ అండ్ నటన అని, 96 నటులు త్రిష, విజయ్ సేతుపతిలను అడుగడుగునా గుర్తు తెచ్చాయి ఇక ట్రైలర్ కూడా అంతే.

Advertisement
CJ Advs

అయితే 96 సినిమా చాలా స్లోగా అనిపిస్తుంది. లవ్ స్టోరీ కానివ్వండి, సెకండ్ హాఫ్ లో స్టోరీ కానివ్వండి చాలా స్లోగా మనసులను తాకుతుంది. అయితే ఇప్పుడు సమంత, శర్వానంద్‌లను పక్కనబెడితే తమిళంలో మ్యాజిక్ క్రియేట్ చేసిన జాను తెలుగులో క్రియేట్ చేస్తుంది అంటే అంతగా నమ్మకం లేదు. ఎందుకంటే ఈ సినిమాకి పెద్దగా క్రేజ్ కానీ, హైప్ కానీ లేదు. అందులోను ఇప్పటివరకు విడుదలైన పాటలు నెమ్మదిగా ఉండడం, టీజర్, ట్రైలర్ కాస్త స్లోగా అనిపించడం చూస్తుంటే అక్కడ వర్కవుట్ అయిన మ్యాజిక్ తెలుగులో కూడా రిపీట్ అవుతుందా అనిపించకమానదు. కానీ జాను ట్రైలర్ మాత్రం సూపర్బ్ అనేలా ఉంది. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ, ప్రేమను కళ్ళతోనే పలికించగల సత్తా కలిగిన జంటగా సమంతకి, శర్వాకి ఫుల్ మార్కులు పడతాయి. మరి 96 లో త్రిష చేసినట్టుగా నేను చెయ్యలేనేమో అని భయపడిన సమంత ఇప్పుడు ఆమెని చూసిన వారు ఎవ్వరైనా అచ్చం త్రిషని చూసినట్టుగా ఉందంటారు.

News About Sharwanand, Samantha Jaanu :

News About Sharwanand, Samantha Jaanu   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs