Advertisement
Google Ads BL

‘వై నాట్’ స్టూడియోస్‌కి 10 వసంతాలు


‘లవ్ ఫెయిల్యూర్’, ‘గురు’, ‘గేమ్ ఓవర్’ తెలుగు నాట ‘వై నాట్’ స్టూడియోస్ విజయ కేతనం పది వసంతాలు పూర్తి చేసుకున్న ‘వై నాట్’ స్టూడియోస్ మీడియాకు కృతఙ్ఞతలు 

Advertisement
CJ Advs

29 జనవరి 2020: ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియోగా మేం ఒక దశాబ్దం పూర్తి చేసుకున్నాం. ఒక బ్యానరుగా సాధారణం కంటే భిన్నమైన కంటెంట్ తో స్థిరంగా సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాం. మా సంస్థను ప్రొడ్యూసర్ ఎస్. శశికాంత్ 2010లో నెలకొల్పారు. ఈ జనవరితో సినీ నిర్మాణంలో పదో సంవత్సరాన్ని గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటివరకూ మేం 18 ఫీచర్ ఫిలిమ్స్ నిర్మించాం. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో చిత్రాలు నిర్మించే అతికొద్ది నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మా సంస్థ గుర్తింపు పొందింది. ఎ.ఆర్. రెహమాన్, రాజ్ కుమార్ హిరాణీ, ఆనంద్ ఎల్. రాయ్ వంటి గొప్ప ప్రతిభావంతులతో కలిసి ఉన్నతస్థాయి చిత్రాల్ని నిర్మించామని  చెప్పుకోవడానికి  ఆనందిస్తున్నాం అని తెలిపారు సంస్థ అధినేత శశికాంత్. 

2010లో తమిళ చిత్రం ‘తమిళ్ పాడం’ తో మేం చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించాం.  సి.ఎస్. అముదన్ డైరెక్ట్ చేయగా శివ హీరోగా నటించిన ఆ మూవీ భారతదేశపు తొలి పూర్తి స్థాయి స్పూఫ్ ఫిలింగా గుర్తింపు పొందింది. మా బ్యానర్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి చిత్రాల్ని ఆశించవచ్చో ఆ సినిమా తెలియజేసింది. అది మూసకు భిన్నమైన ఆసక్తికర, వినోదాత్మక చిత్రం. వినోదాన్నిచ్చే, ఉత్కంఠ కలిగించే ప్రభావవంతమైన కథలతో ‘వై నాట్ స్టూడియోస్’ సినిమాలు నిర్మిస్తుందనే విషయం ఆ మూవీతో ప్రేక్షకులకు తెలిసింది.

మా హిట్ మూవీస్ లో వినూత్న కథనంతో బాలాజీ మోహన్ రూపొందించగా అటు విమర్శకులు, ఇట్లు ప్రేక్షకులు మెచ్చిన ‘లవ్ ఫెయిల్యూర్’ (2013) వంటి  ద్విభాషా రొమాంటిక్ కామెడీలు ఉన్నాయి. వసంత బాలన్ దర్శకత్వంలో ఒక చిత్రం నిర్మించాం. 2016లో సుధ కొంగర దర్శకత్వంలో మేం నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా ‘గురు’ మూడు భాషల్లో నిర్మాణమైంది. సహ నిర్మాతగా హిందీలో తీసిన కామెడీ డ్రామా ‘శుభ్ మంగళ్ సావధాన్’ (2017), ఆ తర్వాత నిర్మించిన ‘గేమ్ ఓవర్’ (2019) సినిమాలు వాణిజ్యపరంగా విజయాలు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందాయి.

అన్ని భాషల్లో సినిమాలు నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి 2018లో అనిల్ డి. అంబాని ఆధ్వరంలోని రిలయెన్స్ ఎంటర్‌టైన్మెంట్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలతో కలిసి జాయింట్-వెంచర్ భాగస్వామ్యాన్ని ఏర్పాటుచేశాం.

2018లో ‘వైనాట్ ఎక్స్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్’ అనే లేబుల్ తో మార్కెంటింగ్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వెళ్లాం. ‘తమిళ్ పాడం 2’ (2018),  ‘సూపర్ డీలక్స్’ (2019), ‘గేమ్ ఓవర్’ (2019), ‘83’ (2020) సహా పలు కంటెంట్-డ్రివెన్ మూవీస్ ని డిస్ట్రిబ్యూట్ చేశాం, చేస్తున్నాం. చురుకైన మార్కెటింగ్ విభాగం.. అది ఏర్పాటైన దగ్గర్నుంచి అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల ప్రమోషన్సును నిర్వహిస్తూ వస్తోంది. 2019లో ‘వైనాట్ మ్యూజిక్’ అనే లేబుల్ తో సంగీతం ప్రపంచంలో అడుగుపెట్టాం. సమీప భవిష్యత్తులో ఉత్తేజకరమైన కేటలాగ్ ని విడుదల చేయబోతున్నాం.

మా పదో వార్షికోత్సవం సందర్భంగా, మా సృజనాత్మక అభిరుచిని నమ్మిన, కొంతకాలం కొత్త బృందంతో ప్రయోగాలు చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మేము థాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంతదాకా మా జర్నీలో ఒక భాగంగా ఉంటూ వస్తున్న మా భాగస్వాములు, తోటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, ఆడియో సంస్థలు, డైరెక్టర్లు, మ్యుజీషియన్లు, ప్రతిభావంతులు, సాంకేతిక నిపుణులు, సర్వీస్ ప్రొవైడర్స్, పీఆర్వోలు, ప్రెస్ అండ్ మీడియా అందరికీ సిన్సియర్ గా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.

‘న్యూ-వేవ్ సినిమా’ ప్రాజెక్ట్స్ ను రూపొందించే మార్గదర్శిగా, ప్రత్యేకించి ఇండియాలో, గుర్తింపు పొందడాన్ని గర్విస్తున్నాం.

“ఈ తరుణంలో మేము మరింత ఉత్తేజకరమైన సినిమాను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముందున్న రహదారి ఎప్పటిలాగే ఉత్తేజకరమైనదిగా కనిపిస్తోంది. ఈ జర్నీని మీ అందరితో పంచుకోడానికి మేం ఎక్కువగా ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకంటే, మా కృషి, పట్టుదలకు మీరందిస్తున్న ప్రశంసలు మమ్మల్ని భావజాలాలు, కొత్త కాన్సెప్టుల రూపకల్పనకు ప్రేరేపించి, మరింత పెద్ద కలలు కనేందుకు ముందుకు తోస్తున్నాయి. ఈ సంవత్సరం మీరు ‘వైనాట్ స్టూడియోస్’ బ్యానర్ కింద ‘డి 40’ (ధనుష్ 40వ చిత్రం), ‘మండేలా’, ‘ఏలే’ సినిమాల్ని ఊహించవచ్చు.’’ అని తెలిపారు - ఎస్. శశికాంత్ (ఫౌండర్, ‘వైనాట్’ గ్రూప్) ఈ సందర్భంగా మీడియాకు ప్రత్యేక  కృతఙ్ఞతలు తెలిపారు.

Y NOT Studios Completed 10 YEARS:

Y NOT Studios Victory at Tollywood
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs