Advertisement
Google Ads BL

అనిల్ రావిపూడి కథకు చెర్రీ ఫిదా.. త్వరలో..!!


సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అనీల్ చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్టవ్వగా.. ఏకంగా సూపర్‌స్టార్ దగ్గరికెళ్లిపోయిన ఆయన.. మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో రాజమౌళి, కొరటాల శివ తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా ఆ జాబితాలో చేరిపోయాడని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఇదే ఊపులో మరో హిట్ మూవీ తెరకెక్కించాలని భావించిన ఆయన.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట.

Advertisement
CJ Advs

ఇప్పటికే చెర్రీతో కలిసి స్టోరీ లైన్ చెప్పగా ఫిదా అయిపోయాడట. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజిబిజీగా ఉన్న చెర్రీ.. ఈ మూవీ షూటింగ్ అయ్యే లోపు కథ పూర్తి చేసుకోవాలని అనిల్‌కు సూచించాడట. ఇప్పటికే దాదాపు తన దగ్గరికి వచ్చిన కథలు అన్నీ కాదనకుండా చేసిన చరణ్.. కామెడీ ఎంటర్‌టైనర్‌లో నటించాలని అనుకున్నారట. ఈ విషయం తెలుసుకున్న అనిల్ రావిపూడి ఆ మరుసటి రోజే మెగా కాంపౌండ్‌లో ప్రత్యక్షమయ్యాడట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టోరీ లైన్ వినిపించడం.. ఆయన ఓకే చెప్పడం.. కథ పూర్తిగా సిద్ధం చేసుకోవాలని చెప్పేయడం అన్నీ చకచకా జరిగిపోయాయట. సినిమా మాస్ కమ్ కామెడీగా ఉండటంతో చెర్రీ కూడా తొందరగానే ఒప్పుకున్నాడట.

అయితే.. ఇప్పటికే చెర్రీ కోసం సందీప్ రెడ్డి వంగా, అట్లీ, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి దర్శకులందరూ వెయిటింగ్‌లో ఉన్నారన్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టార్ డైరెక్టర్స్ అందర్నీ కొద్దిరోజులు పక్కనబెట్టాలని మొదట అనీల్‌కే అవకాశం ఇవ్వాలని చెర్రీ అనుకున్నారట. మరి ఇదే జరిగితే ఆ స్టార్ డైరెక్టర్లు ఊరుకుంటారా..? లేకుంటే మరొకర్ని చూసుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది. కాగా.. అనీల్‌తో సినిమా విషయంలో నిజానిజాలెంతో తెలియాలంటే ఈ దర్శకుడైనా.. లేదా మెగా హీరో అయినా రియాక్ట్ అవ్వాల్సిందే మరి.

Anil Ravipudi All Set To Direct Ram Charan!! :

Anil Ravipudi All Set To Direct Ram Charan!!    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs