Advertisement
Google Ads BL

మరోసారి హీరో ‘అక్క’ పాత్రలో పవన్ హీరోయిన్!


ఎవరికైనా సరే.. మంచి ఫామ్, క్రేజ్ ఉన్నప్పుడే సినిమాలు.. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేయాల్సిందే.. అవి కూడా వద్దనుకుంటే ఇంట్లో నాలుగు గోడలకు పరిమితం కావచ్చన్నది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఓ సిద్ధాంతం!. అయితే సినిమాలంటే ఫ్యాషన్.. ఎక్కడికో ఎదిగిపోవాలనుకున్న కొందరు నటీనటులు ఇండస్ట్రీలోకి వచ్చి కొందరు నిరాశ, నిస్పృహలకు లోనవ్వగా.. మరికొందరు మాత్రం గ్రాండ్ సక్సెస్ అయ్యారు కూడా. అలాంటి వారిలో తెలుగు తెరకి నాజూకు అందాన్ని పరిచయం చేసిన భూమిక ఒకరని చెప్పుకోవచ్చు.

Advertisement
CJ Advs

2000లో ‘యువకుడు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ.. సీనియర్, జూనియర్ హీరోలు అనే తేడా లేకుండా తనకు వచ్చిన పాత్రలనల్లా పోషించేసింది. అంతేకాదు.. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గినప్పటికీ మక్కువ మాత్రం పోలేదు. దీంతో చిన్న చిన్న పాత్రలు వచ్చినా అస్సలు వదులుకోవట్లేదు. ఆ మధ్య లాంగ్ గ్యాప్ ఇచ్చిన ఈ సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇచ్చి అక్క, వదిన పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తోంది. ఇప్పటికే.. నాని సినిమా ‘మిడిల్ క్లాస్ అబ్బాయ్’, ‘సవ్యసాచి’ సినిమాల్లో అక్క పాత్రలో నటించి.. తనకు ఇంకా ఫామ్ పోలేదని నిరూపించుకుంది.

అయితే.. తాజాగా గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాలో హీరోకు అక్కగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్క పాత్రలో నటించి మెప్పించిన ఈ భామనే మరోసారి ‘అక్క’గా నటించాలని అడగ్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. భూమిక పాత్ర సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందట. అంటే అక్క పాత్రలో భూమిక తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరని దర్శకుడు సంపత్ నందికి అర్థమైందన్న మాట. గోపీచంద్ సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ఈ మూవీలో హీరో కబడ్డీ కోచ్‌గా కనిపించబోతున్నాడట. ఈ మధ్య స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ హిట్టే అయ్యాయ్.. మరి ఈ మూవీ ఏ మాత్రం సక్సెస్ అవుతుందో జస్ట్ వెయిట్ సీ..!

Pawan Kalyan ‘Sister’ Role To Tollywood Hero!! :

Pawan Kalyan ‘Sister’ Role To Tollywood Hero!!   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs