Advertisement
Google Ads BL

‘RRR’ ఫొటోలు పోస్ట్ చేసిన ఎన్టీఆర్!


ఓటమెరుగని దర్శకధీరుడిగా పేరుగాంచిన రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘RRR’. ఇందులో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాకపోయినా లీకులు మాత్రం గట్టిగానే వస్తున్నాయ్. ఇటీవలే పులితో ఎన్టీఆర్ ఫైట్ సీన్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఇలా అస్తమాను లీకులు వస్తుండటంతో జక్కన్న చాలా సీరియస్‌గా చిత్రబృందానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట.

Advertisement
CJ Advs

మరోవైపు.. చిత్రానికి సంబంధించి ఎలా అప్డేట్ రాకపోవడంతో ఇటు జూనియర్ అభిమానులు.. అటు చెర్రీ అభిమానులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ వ్యవహారంపై ఇంతవరకూ పెద్దగా రియాక్ట్ కాని జూనియర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజయ్ దేవగణ్ ‘RRR’ సెట్‌లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో ఆయనతో దిగిన ఫొటోలను జూనియర్ పంచుకున్నాడు. ఈ ఫొటోల్లో అజయ్‌తో చెర్రీ, జక్కన్న, ఎన్టీఆర్ ఉన్నారు. మరో ఫొటోలో అజయ్‌తో ఎన్టీఆర్, చెర్రీ మాత్రమే ఉన్నారు. అజయ్ దేవగణ్‌కు జూనియర్ స్వాగతం పలికారు. ‘మా RRR లోకంలోకి అజయ్ సార్‌కు స్వాగతం పలకడం సంతోషంగా ఉంది’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.

కాగా.. ఈ ఫొటోలు చూసిన జూనియర్, నందమూరి వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నిరాశకు లోనైన ఫ్యాన్స్.. తాజా ఫొటోలతో ఆనందంలో మునిగితేలుతూ షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం RRR శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

JR Ntr Posts RRR Photos In Twitter!!:

JR Ntr Posts RRR Photos In Twitter!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs