Advertisement
Google Ads BL

కొత్త దర్శకులు కథలు సిద్ధం చేయండి.. ప్రభాస్ రెడీ!


బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఎవరైనా టాప్ మోస్ట్ డైరెక్టర్ తో సినిమా చేయాలని అనుకుంటారు. కానీ ప్రభాస్ అందుకు విరుద్ధంగా కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన సుజిత్ తో సాహో సినిమా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయిన సాహో బాలీవుడ్ మినహా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి ద్వారా ప్రభాస్ సంపాదించుకున్న స్టార్ స్టేటస్ వల్ల ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే వచ్చాయి.

Advertisement
CJ Advs

 

అయితే యంగ్ డైరెక్టర్ తో చేసిన సాహో సినిమా పరాజయం పాలవడంతో మళ్ళీ కొత్త దర్శకులతో సినిమా చేయడని అందరూ అనుకున్నారు. కానీ ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ కొత్త దర్శకుల కోసం వెయిట్ చేస్తున్నాడట. ప్రభాస్ ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్ అనే అనధికార టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా అనంతరం ప్రభాస్ కొత్త దర్శకులతో చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. 

 

ఇప్పటికే కొంత మంది దర్శకులని కలిశాడని సమాచారం. కొత్త దర్శకులు చేసిన సినిమాలు చూస్తున్నాడట. చూడటమే కాదు వారితో లిమిటెడ్ బడ్జెట్ లో సినిమా చేసి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని భావిస్తున్నాడట. ప్రభాస్ ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం నిజంగా మంచి పరిణామం. పెద్ద దర్శకులతో సినిమా చేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోవడమే కాకుండా, సూపర్ హీరో కథలే వస్తాయి. కొత్త దర్శకులతో వెళితే విభిన్నమైన స్క్రిప్టులు దొరికే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ప్రభాస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. మరి ప్రభాస్ ని మెప్పించే కథ ఏ దర్శకుడి దగ్గర ఉందో..!

Prabhas wants to do a movie with New Directors.:

National Star Prabhas asks to young directors to come up with scripts
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs