Advertisement
Google Ads BL

బన్నీ నిర్ణయంతో సుక్కుకు మరింత టైం దొరికింది..!


బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన "అల వైకుంఠపురములో" చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడవ చిత్రమైన అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి రికార్డు తమ పేరున లిఖించుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. అల్లు అర్జున్ తన తర్వాతి చిత్రాన్ని సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
CJ Advs

 

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయినట్లు సమాచారం. అల వైకుంఠపురములో సినిమా షూటింగ్ పూర్తవగానే అల్లు అర్జున్ సుకుమార్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలని అనుకున్నాడు. కానీ సినిమా ప్రమోషన్ల వల్ల వెళ్లలేక పోయాడు. ఇప్పుడు సినిమా మంచి బ్లాక్ బస్టర్ కావడంతో సక్సెస్ సెలెబ్రేషన్స్ వల్ల మరింత లేట్ అయింది. అయితే బన్నీ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట.

 

అల వైకుంఠపురములో నాన్ బాహుబలి రికార్డుని నెలకొల్పడంతో సుకుమార్ తో చేసే చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల సుకుమార్ మీద ఒత్తిడి పెట్టకూడదని డిసైడ్ అయ్యాడట. అంతే కాదు కథకి ఇంకా మెరుగులు దిద్దుకునే సమయం కూడా ఇచ్చాడట. ఆ సమయంలో అల్లు అర్జున్ తన లుక్ ని సినిమాకి తగ్గట్టు మార్చుకోవడానికి విదేశాలకి వెళ్ళనున్నాడట. అన్నీ కుదిరితే మార్చ్ లేదా ఏప్రిల్ లో షూటింగ్ లో జాయిన్ అవుతాడట. సుకుమార్ కూడా స్లో కాబట్టి కావాల్సినంత సమయం దొరికినట్టే.

By the decission of bunny..Sukumar got much time:

Sukumar got much time to make his movie with Bunny.  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs