ప్రస్తుతం విజయ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నాయి కానీ... టెక్నీకల్ గా చిత్ర బృందం ప్రమోషన్స్ చెయ్యడం లేదు. కేవలం 15 రోజుల టైం మాత్రమే సినిమా విడుదలకు సమయం ఉంది. కానీ సినిమా మీద ఎలాంటి క్రేజ్ ట్రేడ్ లోను లేదు, ప్రేక్షకుల్లోనూ లేదు. కారణం ఏమిటో అర్ధం అయ్యి కాకపోయినా.. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ నిర్మాత కె ఎస్ రామారావు మాత్రం తమ సినిమా ప్రమోషన్ లేట్ అయ్యింది. అది మాములు లేట్ కాదు. బాగా లేట్ అయ్యింది అంటున్నాడు. కారణం టెక్నీకల్ గా సినిమా లేట్ అవడమే అంటున్నాడు. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ఒప్పుకున్నాక వేరే సినిమాలు ఒప్పుకోవడం, ఆ సినిమాల విడుదల ప్రమోషన్స్ లో ఉండడంతో లేట్ అయ్యిందని.
అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ లో విజయ్ దేవరకొండ నాలుగైదు గెటప్స్ లో నటించడంతో ఆ గెటప్స్ విషయంలోనూ సినిమా షూటింగ్ లేట్ అయ్యింది, కాకపోతే రిలీజ్ డేట్ ఇచ్చాక సినిమా వర్క్ పూర్తికాకపోతే కష్టమని ప్రమోషన్స్ లేట్ చేశామని, కానీ ఆ ప్రమోషన్ బాగా లేట్ అయ్యిందిలే అని చెబుతున్నాడు. ఇక సోషల్ మీడియా వచ్చాక సినిమాల ప్రమోషన్స్ ఈజీ అయ్యింది అని మేము ప్రమోషన్స్ లేట్ చేసినా సోషల్ మీడియాలో మా సినిమా ప్రమోషన్ జరిగింది అంటున్నాడు రామారావు. విజయ్ తో సినిమా పెళ్లి చూపులు చూసినప్పుడు నుండే చెయ్యాలనిపించింది అని.. విజయ్ దేవరకొండ మంచి నటుడు అని చెబుతున్నాడు. ఇక ప్రమోషన్స్ లేట్ గా మొదలెట్టినా కొత్తగా చేస్తామని అంటున్నాడాయన.