Advertisement
Google Ads BL

‘RRR’ లీక్స్‌: యూనిట్ తీసుకున్న నిర్ణయమిదేనా?


రాజమౌళి సినిమా RRR పై ఎంత క్రేజుందో.. RRR లీకులపై అభిమానులు కూడా అంతే క్రేజ్ ఫీలవుతున్నారు. ఎంతో పకడ్బందీగా రాజమౌళి RRR ని తెరకెక్కిస్తుంటే.. ఎవరో ఒకరు హీరోల లుక్స్ ని సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నారు. అయితే రాజమౌళి తమ అభిమాన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ల లుక్స్ ని ఇదిగో అదిగో అంటున్నాడు కానీ.. బయటికి రివీల్ మాత్రం చెయ్యడం లేదు. అసలు జనవరి ఫస్ట్ నుండి నిన్న జనవరి 26 రిపబ్లిక్ డే వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ విషయంలో సోషల్ మీడియాలో ప్రచారం జరగడం.... కానీ RRR టీం మాత్రం లుక్స్ రివీల్ చెయ్యకుండా మ్యానేజ్ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మరి అలా చేస్తున్న రాజమౌళిని చూస్తే మండి.. ఎన్టీఆర్ లుక్ ని రెండు సార్లు లీక్ చేసిపారేసారు. ఒకసారి మన్యం అడవుల్లో ఎన్టీఆర్ కొమరం భీం లుక్ రివీల్ అయితే... రెండోసారి ఎన్టీఆర్ యాక్షన్ లుక్ రివీల్ చేసారు.

Advertisement
CJ Advs

మరి రాజమౌళికి ఈలీకులు తలనొప్పిగా మారి.. టైట్ సెక్యూరిటీ పెంచినా లాభం లేకుండా పోతుంది. అందులో రాజమౌళి సినిమా విషయాలంటే బోలెడంత క్యూరియాసిటీ ఉంటుంది. అందుకే ఏ చిన్న విషయాన్నీ వదలకుండా వైరల్ చేస్తున్నారు. అయితే అభిమానులను ఎదుర్కోవడానికి రాజమౌళి పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరిగే దగ్గర సెక్యూరిటీ బాగా టైట్‌ చేసేసాడట. ఎప్పటిలాగే హీరోల మొబైల్స్ కూడా షూటింగ్ సెట్స్ లోకి అనుమతించకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. ప్రస్తుతం చరణ్ ఫ్యాన్స్ ఉబలాటం చూస్తుంటే చెర్రీ లుక్ కూడా లీక్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదని.. అందుకే మార్చిలో చరణ్ బర్త్ డే నాటికి చరణ్ లుక్ రివీల్ చేసే ఆలోచనలో RRR బృందం ఉందట.

RRR Team Takes Sensational Decision with Leaks:

Ram Charan Look From RRR Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs