Advertisement
Google Ads BL

పవన్‌తో ప్రాబ్లమ్ దిల్ రాజుకు కాదు..!!


పవన్ కళ్యాణ్‌తో సినిమా చెయ్యాలనే కోరికను దిల్ రాజు పింక్ రీమేక్ తో తీర్చుకుంటున్నాడు. పవన్ క్రేజ్ తో భారీగా గిట్టుబాటు అవుతుందని భావించి పవన్ కళ్యాణ్ తో సినిమా సెట్ చేయించుకున్నాడు. త్రివిక్రమ్ ద్వారా పవన్ కళ్యాణ్‌ని ఒప్పించి.. పింక్ రీమేక్ మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే కత్తి మీద సామే అని తెలిసినా పవన్ తో సినిమా చేసి అందరి అంచనాలు తల్లకిందులు చెయ్యాలని దిల్ రాజు డిసైడ్ అయ్యాడు. అందుకే పెద్దగా హీరోయిజం అవసరం లేని పింక్ రీమేక్ పవన్ తో సినిమా చేస్తున్నాడు. ఇక పవన్ కూడా దిల్ రాజుకి చాలా తక్కువ డేట్స్ ఇవ్వడమే కాదు.... రోజుకి కొన్ని గంటల టైం మాత్రమే ఇచ్చాడు. పింక్ సినిమాలో హీరో స్క్రీన్ టైం తక్కువ కాబట్టి పవన్ ని వాడుకోవడంలో దిల్ రాజు ఎలాగోలా సక్సెస్ అవుతాడు.

Advertisement
CJ Advs

కానీ సమస్యల్లా క్రిష్ సినిమాకే. ఎందుకంటే పింక్ రీమేక్ ఒక ఎత్తు.. క్రిష్ సినిమా ఓ ఎత్తు. రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్. పింక్ లో పవన్ అవసరం కొంతమేరకే. కానీ క్రిష్ సినిమాకి పవన్ ఎక్కువగా కావాలి. అయితే పింక్ రీమేక్ షూటింగ్ లోనే పవన్ రాజకీయాలు గురించి ఆలోచిస్తూ షూటింగ్ చేస్తున్నాడని, పెద్దగా యాక్టీవ్ గా ఉండడం లేదని.. మునుపటి ఉత్సాహం పవన్ లో కనిపించడం లేదని అంటున్నారు. అలాగే ఎక్కువగా పవన్ కార్ వ్యాన్ లోనే ఉంటున్నాడని.. షాట్ రెడీ అయ్యాకే పవన్ కార్ వ్యాన్ నుండి వస్తున్నాడని.. సెట్ లో ఎవరితో పెద్దగా కలవడం లేదట. మరి దిల్ రాజు ఎలాగోలా పవన్ తో సినిమా ఫినిష్ చేస్తాడు కానీ.. వచ్చినా చిక్కల్లా క్రిష్ సినిమా నిర్మాతలకే. గంటల కొద్దీ కార్ వ్యాన్‌లో ఉంటే.. తమ సినిమా ఎప్పుడు పూర్తి చేసి విడుదల చెయ్యాలో అంటూ అప్పుడే తలలు పట్టుకుంటున్నారట. 

Movie with Pawan: Problem to Krish Not Dil Raju:

Pawan Kalyan, Krish Film Launched To Be Made On Lavish Budget
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs