Advertisement
Google Ads BL

లక్కీ గాళ్ అంటే రష్మికానే..!


నిజంగానే ఆమెని చూస్తే లక్కినే అనాలనిపిస్తుంది. ఎందుకంటే సరిపడా హైట్ లేదు... సరిపడే గ్లామరూ లేదు అయినప్పటికీ.. స్టార్ హీరోల సినిమాలు వరసగా తగులుతూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న సరిలేరు నీకెవ్వరూ అంటూ హిట్ కొట్టిన రష్మిక ఇప్పుడు నితిన్ తో కలిసి భీష్మ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తుంది. ప్రస్తుతం భీష్మ ప్రమోషన్ ఫ్లాట్ ఫామ్ మీదుంది. ఒక్కో సింగిల్ మార్కెట్ లో హడావిడి చేస్తుంటే.. రష్మిక పాప హాట్ యాంగిల్ ఒక్కొక్కటిగా బయటికొస్తుంది. అయితే రష్మిక భీష్మ తర్వాత అల్లు అర్జున్ - సుక్కు కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. వరసగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్తో రష్మిక పిచ్చ హ్యాపీ‌గా అంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా మరో స్టార్ హీరో సినిమాలో రష్మిక బుక్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. అది కూడా ఎన్టీఆర్ సినిమాలో అంటున్నారు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ మూవీ త్వరలోనే సెట్స్ మీదకెళుతుందని ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక హీరోయిన్ గా ఫైనల్ అనే న్యూస్ వినబడుతుంది. ఇప్పటికే రష్మిక తో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ RRR పూర్తికాగానే త్రివిక్రంతో సినిమా మొదలెట్టబోతున్నాడని అంటున్నారు. మరి ఈ దెబ్బకి ఎన్టీఆర్ సరసన కూడా రశ్మికనే హీరోయిన్ అయితే.. అమ్మడు రేంజ్ మారిపోయినట్లే.  ఇప్పటికే మహేష్, అల్లు అర్జున్ ఇప్పుడు ఎన్టీఆర్, అబ్బ ఏం లక్కీనో కదా రశ్మిక.

Rashmika Mandanna Lucky Heroine in Tollywood:

Rashmika Mandanna in Jr NTR and Trivikram Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs