Advertisement
Google Ads BL

దర్శకుడిగా మారుతున్న ‘యమ్ 6’ నిర్మాత


సినీ నిర్మాత విశ్వనాధ్ తన్నీరు ఇటీవల ‘యమ్ 6’ వంటి  సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2‌గా ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు.  

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ ఈ క్రొత్త ప్రాజెక్ట్ విశేషాలను తెలియజేసారు. సినిమా మీద ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చిన నేను ‘యమ్ 6’ సినిమాతో నిర్మాతగా మారాను. ఐతే నాకు దర్శకుడు కావాలనే కోరిక ఎప్పట్నుంచో ఉంది. ఈ క్రమంలో ఎన్నో కథలు విన్నా. చివరకు ఓ అద్భుతమయిన కథ దొరికింది. కంటెంట్ ఆధారంగా నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఈ సినిమా ద్వారా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ చిత్రంలోని క్లైమాక్స్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాలో హీరోగా మా గత చిత్రం ‘యమ్ 6’లో హీరోగా చేసిన ధ్రువను ఎంపిక చేసాం. తనలో మంచి టాలెంట్ ఉంది. ఈ క్యారెక్టర్ కి తను బాగా మ్యాచ్ అవుతాడు. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో హైదరాబాద్, రెండో షెడ్యూల్ వైజాగ్, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కంప్లీట్ చేస్తాము. ఇలా 4 షెడ్యూల్స్ లో సినిమా మొత్తం కంప్లీట్ చేస్తాం అన్నారు. రాగిణి, డి.యస్ .రావు, గురురాజ్, నామాల రవీంద్ర సూరి, మాస్టర్ జైనీత్, దిల్ రమేష్, శివమ్ శివరాత్రి, గిరి, తిలక్, నర్సిరెడ్డి, చంటి, సందీప్, కుమరం మొదలగువారు నటిస్తున్నారని తెలిపారు.

హీరో ధ్రువ మాట్లాడుతూ.. M6 సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేసిన విశ్వనాధ్‌గారికి ధన్యవాదాలు. ఆయన దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా ఇది, నాకు రెండో సారి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో నేను మరింత పేరు తెచ్చుకొని ప్రేక్షకుల ఆదరణ పొందుతాను. ఫిబ్రవరి మొదటివారంలో షూటింగ్ కు వెళ్లి కంటిన్యూటి షెడ్యూల్ లో షూట్ కంప్లీట్ చెయ్యబోతున్నాము అన్నారు.

ఈ చిత్రానికి సాంకేతికవర్గం:

కథ, మాటలు: వేమగిరి, మ్యూజిక్ డైరెక్టర్: విజయ్ కూరాకుల, పాటలు: మౌనశ్రి మాలిక్, ఎడిటింగ్: సోమేశ్వర్ పోచం, పిఆర్ఓ: మధు. విఆర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌: గుర్రపు విజయ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాత: విశ్వనాధ్ తన్నీరు.

M6 Movie Producer Viswanath Tanneeru Turns Director For His Next Project :

Viswanath Tanneeru Next Project Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs