Advertisement
Google Ads BL

కెరీర్ మొదట్లో అలాంటి సినిమాలు చేయాలి: సమంత


పెళ్ళికి ముందు పూర్తి కమర్షియల్ చిత్రాలకు, స్టార్ హీరోల పక్కన నాలుగు పాటలకు డాన్స్‌లు, కథలో అవసరమైనమేరకు నటించి టాప్ నటిగా ఎదిగిన సమంత పెళ్లి తర్వాత కథలో ముఖ్యమైన, కీలకమైన పాత్రలకే పరిమితమవుతూ అందరితో చప్పట్లు కొట్టించుకుంటుంది. అయితే పెళ్లి తర్వాత కమర్షియల్ చిత్రాలకు తానేమి దూరం కాలేదని.. కాకపోతే కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా చెబుతుంది అక్కినేని కోడలు. పెళ్లయ్యాక గ్లామర్ డోస్ పెంచేసిన సమంత ఏ విషయంలోనూ ఎక్కడా తగ్గడం లేదు. కాకపోతే స్టార్ డం అనేది ఓవర్ నైట్ లో వచ్చేది కాదని... ఎంతో కష్టపడితేనే ఏదైనా సాధ్యమని చెబుతున్న సమంతని ఈమధ్య కాలంలో కథల ఎంపిక, పాత్రల ఎంపికలో వచ్చిన మార్పుకి కారణమేమిటని అడగగానే...

Advertisement
CJ Advs

ఇదంతా రాత్రికి రాత్రే జరిగింది కాదని.. కెరీర్ మొదట్లో ఎలా ఉంటే ఇండస్ట్రీలో నిలబడగలమో అలాంటి సినిమాలు చేశా అని.. కానీ ఇప్పుడు నటిగా తనదైన ముద్ర వెయ్యాలని దానికి తగ్గట్టుగా కథల ఎంపిక చేసుకుంటున్నానని చెబుతుంది సమంత. మన నుండి దర్శకులు ఏం కోరుకుంటున్నారో, మనం ఏం చేయగలమో అనేది దర్శకులకు సంకేతాలిస్తుంటే.. వారే మనకి తగిన ప్రాధాన్యమున్న పాత్ర ఇస్తారని.. అందుకే నటనతో ఎప్పటికప్పుడు దర్శకులను మెప్పిస్తూ డిమాండ్ చేస్తే వారే బలమైన పాత్రలను సృష్టిస్తారంటుంది సమంత.

Directors Creates Characters For Me says Samantha :

Samantha about Stardom
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs