Advertisement
Google Ads BL

బన్నీ ఈ విషయంలోనూ తగ్గడం లేదు..!


అనిల్ రావిపూడితో మహేష్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మహేష్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉండి... సినిమా విడుదలకు ముందు.. విడుదలయ్యాక కూడా చిత్ర బృందానికి ఆదిరిపోయే పార్టీలను మహేష్ స్వయంగా తన ఇంట్లోనే ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయ్యాక రెండు రోజులు వరసగా చిత్ర బృందానికి మహేష్ ఇచ్చిన పార్టీ విశేషాలు సోషల్ మీడియాని కమ్మేశాయి. గతంలో మహేష్ తన సినిమా పార్టీలకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటోళ్లని ఆహ్వానించినప్పటికీ.. సరిలేరు పార్టీలకు మాత్రం కేవలం చిత్రం బృందమైన రష్మిక, అనిల్, విజయశాంతి, సంగీత, వంశి పైడిపల్లి, నమ్రత, సితారలతో కానిచ్చేశాడు. అయితే సరిలేరు పార్టీలను తలదన్నేలా ఇప్పుడు అల్లు అర్జున్ ‘అల..’ పార్టీ ఇవ్వబోతున్నాడట.

Advertisement
CJ Advs

అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అంటూ నిర్మాతలు అనౌన్స్ చేసేయడం, చిత్ర బృందం సక్సెస్ మీట్ పెట్టి.. అల రికార్డుల గురించి మాట్లాడడం అయ్యింది. ఇక అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా హిట్ అవడం, రికార్డు కలెక్షన్స్ కొళ్లగొట్టడంతో.. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు పార్టీ ఇవ్వబోతున్నాడట. కేవలం ఇండస్ట్రీ ప్రముఖులకే కాదండోయ్.. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకమైన పార్టీతో పాటుగా కమ్మనైన విందు ఏర్పాటు చేయబోతున్నాడట. 

పరిశ్రమలోని హీరోలు అంటే బన్నీ క్లోజ్ అయిన చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటోళ్ళు, తనతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలు, కలిపి ఓ పార్టీ, మీడియా మిత్రులకి ఓ పార్టీ ఉండబోతుందట. మరి ఈ స్పెషల్ పార్టీస్ కూడా అల వైకుంఠపురములో మూవీ హిట్ రేంజ్ లో ఉండబోతున్నాయిని.. మహేష్ సరిలేరు పార్టీలకన్నా అల పార్టీనే హైలెట్ కాబోతుందనే న్యూస్ నడుస్తుంది.

Ala Vaikunthapurramloo Parties Time to Bunny:

Allu Arjun Plans Grand Parties With Ala Vaikunthapurramloo Success
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs