Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడుగా!


టైటిల్ చూడగానే ఇదేంటి.. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలూ లేవు.. రాజకీయాలపై ప్రస్తుతానికి ఆసక్తీ లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పేశాడుగా.. మళ్లీ ఈ పుకార్లేంటి..? అనుకుంటున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే.. జూనియర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు.. కానీ మీరనుకుంటున్నట్లుగా రియల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో మాత్రమే.! అసలు ఎన్టీఆర్‌తో పొలిటికల్ టచ్ ఉన్న సినిమాను ఎవరు తెరకెక్కిస్తున్నారు..? రీల్ పరంగా అయినా నిజంగానే ఎంట్రీ ఇస్తున్నారా..? అనే ఆసక్తికర విషయాలు www.cinejosh.com అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

Advertisement
CJ Advs

హీరోయిన్ ఫిక్స్!

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘RRR’ చిత్రం తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ సినిమా ఉంటుందని ఇప్పటికే వార్తలు గట్టిగా వినిపిస్తున్న విషయం విదితమే. అంతేకాదు త్రివిక్రమ్ స్టోరీ లైన్ చెప్పడం.. జూనియర్ ఓకే చెప్పేయడం కూడా జరిగిపోయాయట. అయితే ఇక మిగిలిందల్లా RRR షూటింగవ్వడం.. ఇక్కడ జాయిన్ అవ్వడమేనట. మరోవైపు మాటల మాంత్రికుడు హీరోయిన్‌ను కూడా వెతిపట్టేశారట. జూనియర్‌తో ఇప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలుతున్న రష్మిక మందన్నా రొమాన్స్ చేయనుందని సమాచారం. ఈ కాంబోలో వస్తున్న చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌,ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కించబోతున్నారట.

ఢిల్లీ రాజకీయాల్లో జూనియర్ చక్రం!

ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమాకు ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయబారం సన్నివేశంలో పాండవులతో సంధి కుదరక పోయినా.. ‘అయినను పోయి రావాలె హస్తినకు’ అనే తిక్కన్న మహాభారతంలో వాడిన పదజాలం ఎంతో ప్రఖ్యాతి పొందిన సంగతి తెలిసిందే. అయితే.. మాంత్రికుడు లెక్కల ప్రకారం.. ఢిల్లీ స్థాయి రాజకీయాల్లో ఎన్టీఆర్ చక్రం తిప్పుతాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సమ్మర్‌లో సినిమా పట్టాలెక్కించేసి సంక్రాంతి లేదా అంతకంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. 

ఇప్పటికే.. ఈ బుడ్డోడు పలు సినిమాల్లో పొలిటికల్ టచ్ ఉంది కానీ.. పూర్తిగా లేదు.. అంతంత మాత్రమే. అయితే ఇంతవరకూ బుడ్డోడిలోని అన్ని యాంగిల్స్ చూసేసిన నందమూరి వీరాభిమానులు ఇక పొలిటికల్ టచ్ చూస్తారన్న మాట. గత రెండ్రోజులుగా అటు వెబ్ సైట్లలో.. ఇటు సోషల్ మీడియాలో కోడై కూస్తున్న ఈ పుకార్లలో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.

Jr Ntr Political Entry.. Details Here..!:

Jr Ntr Political Entry.. Details Here..!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs