ఇదిగో.. ఈ పక్కనున్న ఫొటోను చూస్కోండి.. చూసినోళ్లకు చూసినంత.. తిట్టినోళ్లకు తిట్టుకున్నంత.. అదీ సంగతి. ఈ ఫొటోను చూసిన జనాలు నేత్రానందం పక్కనెడితే బూతులు తిట్టేస్తున్నారు. మరికొందరైతే వామ్మో.. ఈ క్లీవేజ్ షో మాకొద్దు బాబోయ్.. ఏంటిది ప్రియాంకా.. అంటున్నారు. ఈ బ్యూటీ ఇంత హాట్ హాట్‌గా క్లీవేజ్ షో చేయడం వెనుక కారణమేంటి..? ఎందుకిలా చేసిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు మందే నా అందాల ఆరబోతకు సాటిలేరని తెగ చూపించేసింది.!. పెళ్లయ్యిందిగా.. ఇక అలాంటివేమీ ఉండవ్.. బుద్ధిగా ఉంటుంది కదా అని అందరూ అనుకున్నారు కానీ.. పెళ్లితోనే ప్రియాంకకు మరింత ఫ్రీడమ్ వచ్చినట్లయ్యిందేమో కానీ అస్సలు తగ్గట్లేదు. ఎవరేం అనుకున్నాం నాకేంటి.. నా ఆరబోత మాత్రం ఉంటుందంతే.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ఇదిగో తాజాగా.. ‘గ్రామీ అవార్డ్స్ 2020’ వేడుకలకు భర్త నిక్‌తో కలసి ప్రియాంకా హాజరైంది. హాజరైంది అంతవరకూ ఓకే.. ఆమె ధరించిన దుస్తులు.. ఆ క్లీవేజ్ షో చూసిన జనాలు విస్తుపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఎంత హాలీవుడ్‌కు వెళితే మాత్రం ఇలా సాంప్రదాయాలు మరిచిపోతే ఎలా ప్రియా.. అంటూ విమర్శకులు తిట్టిపోస్తున్నారు. బహుశా ఈ తిట్ల కామెంట్స్ అన్నీ చూసిన ప్రియాంకకు నోటి మాటలు వచ్చుండవేమో..!. అందాల ఆరబోయడంలో తప్పులేదు కానీ.. ఇలా బట్టలు పారేసుకుని మరీ.. షో చేయడం ఎంతవరకు మంచిదో మీరే ఆలోచించండి ప్రియా అంటూ సినీ విమర్శకులు చెబుతున్నారు.