Advertisement
Google Ads BL

పవన్‌ను టార్గెట్ చేసిన హీరో.. షాకింగ్ కామెంట్స్!


జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఏ క్షణాన ఇచ్చాడో కానీ.. ఆయనకు రాజకీయాలు మాత్రం అంతగా అచ్చి రాలేదని సొంత వీరాభిమానులే చెవులు కొరుక్కుంటున్నారు. అలా రాజకీయాల్లో రాణించలేకపోయిన ఆయన.. ఇప్పటికే పలు పార్టీలతో జతకట్టిన పవన్.. తాజాగా బీజేపీ-జనసేన దోస్తీ కట్టాయ్. 2024లో అయినా జనసేనానికి కాలం కలిసొస్తుందో లేదో. 2019 ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పాలైన తర్వాత పవన్ చాలా మంది ప్రముఖుల నోళ్లల్లో నానుతున్నారు. మరోవైపు సినిమాల్లోకి కూడా పవన్ రీ ఎంట్రీ ఇస్తుండటంతో మరింత విమర్శలు ఎక్కువయ్యాయ్.. మరీ ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని అదే పనిగట్టుకుని మరీ వ్యతిరేకిస్తుండటం.. మీడియా ముందుకు వచ్చి హడావుడి చేస్తుండటంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా.. అప్పట్లో ‘ఆనంద్’ సినిమాలో నటించి మెప్పించిన అందాల హీరో రాజా.. పవన్ కల్యాణ్‌ను నోటి కొచ్చినట్లుగా తిట్టి పోశారు. సినిమాలకు దూరమైన తర్వాత బ్రదర్ రాజాగా ఈ హీరో మారిపోయారు. నాటి నుంచి ఇక యెహోవా అంటూ ప్రసంగాలు చేస్తూ.. ఇటీవల పవన్‌ను ఉద్దేశించి.. ‘ నువ్వేమైనా మెస్సయ్య అనుకుంటున్నావా? ఏంటి..? నువ్వేమైనా లోకరక్షకుడివా. ఎందుకయ్యా నీకు అంత అహంకారం’ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. ప్రజల మధ్యలోకి వెళ్లి కనీసం వారం రోజులైనా పాదయాత్ర చేయవయ్యా అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల ఆవేదనను తెలుసుకుని అప్పుడు మీ మాటలు మాట్లాడండని హితవు పలికారు.

అంతేకాదు.. పవన్ ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నాడని.. అలా చేయడం వల్ల ఏమీ రాదన్నారు. బీజేపీ-జనసేన కలయికను కూడా ఆయన ప్రస్తావిస్తూ.. ‘ఎవరో ఒకరు నిన్ను నడిపిస్తే నువ్ వాళ్లు చెప్పినట్టు బొమ్మలా నటించడం కాదు.. వాళ్ల చేతుల్లో కీలుబొమ్మగా మారి ఏదేదో మాట్లాడుతున్నావ్’ అని పవన్‌పై రాజా ఆగ్రహంతో ఊగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జనసేన కార్యకర్తలు, పవన్ వీరాభిమానులు.. రాజానా ఓ ఆట ఆడేసుకుంటున్నారు. మరి పవన్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో!!

Tollywood Hero Shocking Comments On Pawan!:

Tollywood Hero Shocking Comments On Pawan!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs