Advertisement
Google Ads BL

చిరు కుమార్తె లవ్‌ మ్యారేజ్‌లో చంద్రబాబు కుట్ర!!


అవునా.. ఇదేంటి విచిత్రంగా ఉందే అని అనుకుంటున్నారు కదా..? ఈ విషయం అక్షరాల నిజమని టాలీవుడ్ నటుడు కమ్ రచయిత పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూ వేదికగా స్పష్టం చేశారు. ఇంతకీ అసలేంటీ పంచాయితీ..? అసలు మెగాస్టార్ చిరంజీవి కుమార్తె పెళ్లికి టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబధమేంటి..? నిజంగానే ఆయన కుట్ర పన్నారా..? కుట్ర పన్నాల్సిన అవసరం చంద్రబాబుకు ఎందుకుంది..? అనే ఆసక్తికర విషయాలను పోసాని ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement
CJ Advs

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, అంతకుముందు పోసాని మీడియా మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ఆఖరికి ఓ మీడియా సంస్థ అధినేతపై కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ విర్రవీగిన సంగతి తెలిసిందే. అయితే.. సెన్సేషనల్ అవ్వడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతారో లేకుంటే మరేమైనా కారణాలున్నాయో తెలియట్లేదు కానీ.. మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ఈయన చేసే హడావుడి మాత్రం అంతా ఇంతా కాదండోయ్!. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె లవ్ మ్యారేజీలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర పన్నారని ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు.

చంద్రబాబూ.. నిజం చెప్పండి.. చిరంజీవి కుమార్తె ప్రేమ పెళ్లి విషయంలో చిరంజీవి ఇంట్లో ఆడవాళ్లని కంట్రోల్ చేసుకోలేనివాడు దేశాన్ని ఏం కంట్రోల్ చేస్తాడని అనిపించావా లేదా..?. మీ కింది నేతలతో చిరంజీవి ఫ్యామిలీని అప్పట్లో తిట్టించావా లేదా? రెండు మూడ్నెళ్లు అదే పనిగా చిరు ఫ్యామిలీని టార్గెట్ చేయించిన విషయం నిజం కాదా..? అంటే చిరంజీవి సెన్సిటివ్ కాబట్టి అతని వీక్ పాయింట్‌ను పట్టుకుని చంద్రబాబు ఇబ్బందుల పాలు చేశారు. ఇలా చేయడం వల్లే చిరు ఇంట్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పోసాని క్రిష్ణ మురళి చస్తే.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావొచ్చు అని ఎవరైనా చెప్తే.. చంద్రబాబు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు. పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు. అందులో ఎలాంటి సమస్య లేదుఅని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. పలువురు నెటిజన్లు, విమర్శకులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు టీడీపీకి సంబంధించిన కొందరు ముఖ్య కార్యకర్తలు సైతం పోసానికి గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. మరి టీడీపీ నేతలు ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో!

News About Chiru Daughter Marriage..!!:

News About Chiru Daughter Marriage..!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs