Advertisement
Google Ads BL

నాకందుకే అంత ఇస్తున్నారంటున్న పూజా హెగ్డే!


ఈమధ్యన పూజా హెగ్డే హిట్స్ చూసుకుని రెచ్చిపోయి.. నిర్మాతలను అధిక పారితోషకం డిమాండ్ చేస్తుంది అనే న్యూస్ సోషల్ అండ్ వెబ్ మీడియాలో విపరీతముగా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఆ వార్తలేమి గాసిప్ కాదండోయ్ నిజమే. నిర్మాతలు తనకి అడిగింది ఇస్తున్నారు అంటుంది. ఎందుకంటే వరసగా పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలు హిట్ కావటంతో ఇప్పుడు పూజా ఏం మాట్లాడిన కరెక్ట్ గానే కనబడుతుంది. వాల్మీకి, అల వైకుంఠపురములో హిట్ అవడంతో పూజా కూడా నిర్మాతలను భారీగానే డిమాండ్ చేస్తుంది అనే టాక్ వినబడుతుంది.

Advertisement
CJ Advs

అది నిజమే అంటూ పూజా హెగ్డే తాజాగా క్లారిటీ ఇచ్చింది. కథలతో పాటు.... ఆ సినిమా హిట్ గురించి, కలెక్షన్స్ గురించి కూడా పట్టించుకుంటాను అలాగే... సినిమా ప్రమోషన్స్ కి కూడా నాకు చేతనైనంతగా కష్టపడతాను కాబట్టే  నాపై నమ్మకంతో నా నిర్మాతలు కూడా నేను అడిగినంత పారితోషికం ఇస్తున్నారు అంటుంది. అలాగే పెద్ద హీరోల సినిమాల్లో తాను ఉండాలని వారు కోరుకుంటున్నారని.. అలాగే నాకిచ్చిన పాత్రకి నేను తగిన న్యాయం చేస్తున్నా అని, నా నిర్మాతలకు లాభం రావడం కూడా ముఖ్యమే కదా అంటూ చిలకపలుకులు పలుకుతుంది ఈ చిన్నది.

Pooja Hegde Clarity about Remuneration:

Pooja Hegde Talks About Hero Remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs