Advertisement
Google Ads BL

హీరోయిన్లకు అస్సలు తగ్గనంటున్న ఆంటీ..!


టాలీవుడ్ హీరోయిన్లకు నేను ఏ మాత్రం తగ్గనని సీనియర్ ఆర్టిస్ట్ కమ్ ఆంటీ అంటోంది. అంతేకాదండోయ్.. తన అంద చెందాలతో కుర్రకారుకు మతిపోగొడుతోంది. హీరోయిన్లకు పోటీగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో కుర్రకారు ఆమె ఫొటోలకు ఎగబడి మరీ పాలో అవుతూ.. కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ రేంజ్‌లో బిల్డప్ ఇస్తున్న ఆ ఆంటీ ఎవరబ్బా అని అనుకుంటున్నారా..? ఆమేనండోయ్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ‘ప్రగతి’. 

Advertisement
CJ Advs

ఈ ఆంటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒకట్రెండేళ్లు కాదు దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించి మెప్పించింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మలమ్మ, అన్నపూర్ణ, సుధల తర్వాత తల్లి పాత్రల్లో ఆ రేంజ్‌లో పాపులర్ అయ్యింది ఈ ప్రగతి ఆంటీనే అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఒక్క తెలుగు భాషలోనే కాదు.. ఇతర భాషల్లోనూ చేసి మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే.. ఇలా పాపులర్ అయ్యే సరికి అది ఇంకాస్త పెంచుకోవాలి అనుకున్నదో ఏమోగానీ.. తన వయస్సేం పెరగట్లేదు.. తగ్గుతోందన్నట్లుగా ఇదిగో పక్కనుండే ఫొటోలను పోస్ట్ చేస్తోంది.!

తాజాగా.. ఈ ఆంటీ పోస్ట్ చేసిన ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. స్లీవ్‌లెస్ జాకెట్.. లైట్ శారీతో దిగిన ఈ ఫొటోను జనాలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదండోయ్.. భుజంపైన పచ్చబొట్టు కూడా చూపిస్తోంది. ఇవన్నీ ఓ ఎత్తయితే బ్యాక్ మొత్తం అద్దంలో వెనక భాగం కనిపించేలా హడావుడి చేస్తుండటం గమనార్హం. దీంతో నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే బాగున్నారు ఆంటీ.. ఎంతసేపు తల్లి పాత్రలేనా మంచి గ్లామరస్ క్యారెక్టర్స్ చేయొచ్చుగా అని ఉచిత సలహాలిస్తున్నారు. మరి ఆంటీ అలా గ్లామరస్ రోల్స్ కోసమే ఇలా హాట్ హాట్ అందాలు ఆరోబోస్తోందో ఏంటో ఎవరికి ఎరుక..!

News About Famous Tollywood Lady Artist!!:

News About Famous Tollywood Lady Artist!!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs