Advertisement
Google Ads BL

‘అల వైకుంఠపురములో’కి ఇప్పుడెవ్వరూ సరిలేరంతే!!


సంక్రాంతి మూవీస్‌లో ముఖ్యమైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాల మధ్యన రెండు వారాల పాటు గట్టి పోటీ నడిచిందనే చెప్పాలి. మహేష్ బాబు మాస్‌గా, అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ లుక్ అండ్ క్లాస్‌గా చెలరేగిపోయారు. మహేష్ - అనిల్ రావిపూడి సరిలేరు సినిమాకి మాస్ హిట్ పడగా.. బిసి సెంటర్స్ ప్రేక్షకులు సినిమాని లేపారు. అయితే అల వైకుంఠపురములో సినిమాకి ఫ్యామిలీస్ కనెక్ట్ అవడంతో.. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ సినిమాపైనే పడ్డారు. ఇక రెండు సినిమాల కలెక్షన్స్ పోరు పది రోజుల పాటు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జరిగింది. ఇక మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అని, మా సినిమా కలెక్షన్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అంటే మా సినిమా కలెక్షన్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ ఫ్యాన్స్ హంగామా మాములుగా జరగలేదు.

Advertisement
CJ Advs

అయితే గత వారం రోజుల నుండి సరిలేరు నీకెవ్వరు కలెక్షన్స్ డ్రాప్ అవడంతో సరిలేరు చిత్ర బృందం కలెక్షన్స్ బయటికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. మా సినిమా ఫైనల్ రన్ ముగిశాకే కలెక్షన్స్ బయటపెడతామని చెప్పారు. కానీ అల వైకుంఠపురములో చిత్ర బృందం ఆగడం లేదు. మా సినిమా కలెక్షన్స్ నాన్ బాహుబలి రికార్డ్స్ అంటూ రోజుకో పోస్టర్ వదులుతుంది. ఓవర్సీస్‌లో టాప్ ఫైవ్‌లో చేరిన అల వైకుంఠపురములో సినిమా ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోఇండస్ట్రీ హిట్ అంటూ ఓ ఫిగర్ కాదు పోస్టర్ కూడా వదిలారు. అఫీషియల్‌గా అల వైకుంఠపురములో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అంటున్నారు. మరి మూడో వారంలో సరిలేరు సర్దుకుంటే.. అల వైకుంఠపురములో జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

Ala Vaikunthapurramuloo Industry Hit (Non BB) Poster Out:

Ala Vaikunthapurramuloo Creates Records at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs