Advertisement
Google Ads BL

చిరు కండీషన్స్‌తో కొరటాలలో టెన్షన్!


చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టినప్పటికీ.. ఆ సినిమా రీమేక్ కథ కావడంతో.. ఆ సినిమా హిట్ అయినా అంతగా అనిపించలేదు. ఇక సై రా నరసింహారెడ్డి సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తే... ఇక్కడ తెలుగులో తప్ప అది మరెక్కడా హిట్ కాలేదు. అలాగే సై రా సినిమాకి భారీ బడ్జెట్ పెట్టడం... కొని సీన్స్ రీ షూట్స్ జరగడంతో బడ్జెట్ దుబారా బాగా ఎక్కువైంది. అలాగే మొన్నీమధ్యన జీఎస్టీ రూపంలోనూ సైరాకి తడిసిమోపెడయ్యింది. అందుకే చిరంజీవీ ఇప్పుడు కొరటాల శివకి కండిషన్స్ అప్లై అంటున్నాడట.

Advertisement
CJ Advs

ఓన్ ప్రొడక్షన్ కాబట్టి.. చిరు బడ్జెట్ కంట్రోల్ పెట్టడమే కాకుండా.. 90 రోజుల్లో సినిమా కంప్లీట్ చెయ్యాలని దర్శకుడు కొరటాలకు చెబుతున్నారట. అలాగే అనవసర సీన్స్ లేకుండా పేపర్ పై ఎడిటింగ్ చేసుకొని సెట్స్ పైకి వెళ్తున్నారట. చిరు, కొరటాల సినిమాకి బడ్జెట్ ని చాలా స్ట్రిక్ట్ గా కంట్రోల్ పెడుతున్నట్లుగా చెబుతున్నారు. సైరా అప్పుడు చిరు ఎంత చెప్పినా చరణ్ వినకపోవడంతో ఆ సినిమాకి బడ్జెట్ కంట్రోల్ తప్పిందని అందుకే ఇప్పుడు చిరు చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నాడని అంటున్నారు. 

అంతేకాకుండా సైరా విషయంలో కొన్ని అనవసరమైన సీన్స్‌ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించి చివరికి వాటిని ఎడిటింగ్‌లో తీసెయ్యాల్సి రావడంతో చాలా డబ్బు వృధాగా ఖర్చయ్యిందట. అందుకే సైరాకి జరిగిన తప్పులు ఈ సినిమాకు జరగకూడదనే చిరంజీవి ముందుగానే కొరటాల శివకు చెప్పడంతో.. కొరటాల శివ, చిరు చెప్పినట్లుగా తలాడించినా... కొద్దిగా టెన్షన్ ఫీలవుతున్నట్లుగా చెబుతున్నారు.

Koratala Siva and Chiranjeevi.. Chiru152 Movie Latest Update:

Koratala Siva in Tension with Chiranjeevi Conditions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs