Advertisement
Google Ads BL

ఇప్పుడీ హాలీవుడ్ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం!


ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అవార్డ్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘1917’ 

Advertisement
CJ Advs

రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆంబ్లిన్‌ పార్టనర్స్‌ సంస్థలు మొదటి ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నిర్మించిన ‘1917’ చిత్రం ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైంది. సామ్‌ మెండెస్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ వార్‌ ఎపిక్‌ డ్రామా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. 92వ అకాడమీ అవార్డులకు 10 నామినేషన్లు పొందింది. అలాగే బఫ్తా అవార్డ్స్‌కు ఈ సంవత్సరం 9 నామినేషన్లను పొందింది. ఇవికా 77వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో ‘1917’ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. అలాగే దర్శకుడు సామ్‌ మెండెస్‌ ఉత్తమ దర్శకుడిగా అవార్డు గెలుచుకున్నారు. 25వ యాన్యువల్‌ క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడుగా సామ్‌ మెండెస్‌, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా రోజర్‌ డీకిన్స్‌, ఉత్తమ ఎడిటర్‌గా లీ స్మిత్‌ అవార్డులను పొందారు.

ఈ చిత్రం అమెరికా, యు.కె.ల్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో ఓపెనింగ్‌ కలెక్షన్స్‌లో నెం.1గా నిలిచింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ రాబట్టింది.

‘1917’ చిత్రం భారత దేశంలోని ప్రముఖ దర్శకుల ప్రశంసలు అందుకుంది. వీరి కోసం ఇటీవల ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ దర్శకుల్లో శ్రీరామ్‌ రాఘవన్‌, నితేష్‌ తివారి, విజయ్‌ కృష్ణ ఆచార్య, విక్రమాదిత్య మోత్వాని, శ్రీనారాయణ్‌ సింగ్‌ తదితరులు ఉన్నారు.

ఈ చిత్రం గురించి శ్రీరామ్‌ రాఘవన్‌ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా దీన్ని మీరు ఓన్‌ చేసుకుంటారు. ఫెంటాస్టిక్‌ మూవీ ఇది. తప్పకుండా చూడండి’’ అన్నారు.

నితేష్‌ తివారి మాట్లాడుతూ... ‘‘ఒక ఫిల్మ్‌ మేకర్‌గా ఇది గొప్ప సినిమా అని చెప్పగలను. హానెస్ట్‌గా చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత నేను ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ షాక్‌లోనే నేను థియేటర్‌ నుంచి బయటికి వచ్చాను. ఇలాంటి అద్భుతమైన సినిమా చూసిన తర్వాత ఫిల్మ్‌మేకర్‌గా చాలా చిన్నవాడ్ని అనిపించింది. మీరు నిజమైన సినిమా ప్రియులైతే, ఒక గొప్ప సినిమా చూడాలని మీరనుకుంటే తప్పకుండా వెళ్లి ‘1917’ సినిమా చూడండి’’ అన్నారు.

విజయ్‌కృష్ణ ఆచార్య మాట్లాడుతూ... ‘‘యుద్ధ నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ నిజానికి యుద్ధాన్ని వ్యతిరేకించేవే. దాన్ని టార్గెట్‌ చేసుకొని రూపొందించిన సినిమా ‘1917’. ఈ సంవత్సరం నేను చూసిన గొప్ప సినిమాల్లో ‘1917’ ఒకటి. ఈ సబ్జెక్ట్‌ని చాలా అద్భుతంగా హ్యాండిల్‌ చేశారు దర్శకుడు. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్‌ ఎంతో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు’’ అన్నారు.

విక్రమాదిత్య మోత్వాని మాట్లాడుతూ... ‘‘1917 చిత్రం టెక్నికల్‌ అద్భుతం. మీరు ఇప్పటివరకు చూడని డైరెక్షన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో కనిపిస్తాయి’’ అన్నారు.

శ్రీనారాయణ్‌ సింగ్‌ మాట్లాడుతూ... ‘‘1917 చిత్రం ఇప్పటివరకు వచ్చిన గొప్ప వార్‌ మూవీస్‌ సరసన నిలుస్తుంది. ఎక్కడా కాంపమ్రైజ్‌ అవ్వకుండా టెక్నికల్‌గా అద్భుతంగా రూపొందించిన సినిమా ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒన్‌ షాట్‌ వండర్‌’’ అన్నారు.

డ్రీమ్‌ వర్క్స్‌ పిక్చర్స్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో న్యూ రిపబ్లిక్‌ పిక్చర్స్‌, నీల్‌ స్ట్రీట్‌ ప్రొడక్షన్‌.. మొగాంబో ఈ చిత్రాన్ని నిర్మించారు.

జార్జ్‌ మెక్‌కే, డీన్‌ చార్లెస్‌ చాప్‌మేన్‌, కొలిన్‌ ఫెర్త్‌, బెనెడిక్ట్‌ కుంబర్‌బ్యాచ్‌ తదితరులు ఈ సినిమా ముఖ్యపాత్రలు పోషించారు. జనవరి 17న రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా ఈ చిత్రం భారతదేశంలో విడుదలైంది. 

Hollywood Film 1917 Creates Sensation :

Top Directors Talks About 1917 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs