టాలీవుడ్‌లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్వీ రాజ్ 2019 ముందు వరకూ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. డైరెక్టర్స్ ఈయన కోసం కొన్ని కొన్ని పాత్రలే సృష్టించేవారంటే అప్పట్లో ఆయన రేంజ్ ఎలా ఉండేదో చూడండి. అయితే ఎప్పుడైతే అటు వైసీపీ తీర్థం పుచ్చుకుని.. ఇటు సినిమాలు అంటూ రెండు పడవల మీద అడుగులేసి ముందుకెళ్తున్నాడో అప్పట్నుంచి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయ్!. ఎందుకంటే ఆయన నోరు అలాంటిది మరి.. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అంటారు కదా..!. ఇంతకీ పృథీ 2019 తర్వాత ఏమేం మిస్ చేసుకున్నాడు..? ఈయనకే ఎందుకిలా జరుగుతోంది..? అనే ఆసక్తికర విషయాలు www.cinejosh.com అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత పృథ్వీ.. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై.. మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీపై విరుచుకుపడ్డాడు. అందుకు పర్యవసనం ఇప్పటికే చాలానే చెల్లించుకున్న ఆయన.. సంక్రాంతి కానుకగా వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో పాటు.. ఈ చిత్రంలో నటించిన ప్రతి పాత్రదారుడికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో టబు భర్త జయరాం బామ్మార్థిగా నటించిన సునీల్, హర్షవర్ధన్ పాత్రల్లో ఏదో ఒక దానికి పృథ్వీని తీసుకోవాలని భావించారట. అయితే బన్నీ మాత్రం ఆయన్ను వద్దంటే వద్దని పట్టుబట్టాడట. అలా పృథ్వీకి బన్నీ షాకివ్వడంతో ఆయన స్థానంలో హర్షవర్ధన్‌ను తీసుకున్నారట. అంటే దీన్ని బట్టి చూస్తే.. మెగా హీరోలు నిజంగానే పృథ్వీని బ్యాన్ చేసేశారన్న మాట.
మొత్తానికి చూస్తే తన నోరు దురుసుతనం వల్ల హిట్ సినిమా అయిన ‘అల వైకుంఠపురములో’ మంచి పాత్రను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పోగొట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. కాగా.. అటు సినిమాలు రాక.. ఇటు వైసీపీకి ఆయన చేసిన కృషిని గుర్తించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలిచి మరీ పదవి కట్టబెట్టగా అది కూడా మూడ్నాళ్లు కూడా సక్రమంగా నిలబెట్టుకోలేకపోయిన పృథ్వీకి ఈ మధ్య ఎందుకో సీన్ అంతా రివర్స్ అవుతోంది. మరి ఇకనైనా తన తప్పులు తెలుసుకుని మంచి మెలిగితే మళ్లీ ‘థర్టీ ఇయర్స్’ అని కాలరెగరేసుకుని తిరగొచ్చు.. మార్పు మంచిదే పృథ్వీ.. జర దాని సంగతేంటో చూడు మరి.!