Advertisement
Google Ads BL

ఓహో.. బాలయ్య ‘గుండు’ వెనుక అసలు కథ ఇదా!?


‘సింహా’,‘లెజెండ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు పేరు మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఇప్పటికే ఒకట్రెండు అనుకోగా అవి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇప్పటికే సినిమా రెగ్యులర్ షూటింగ్ చేయాలని బోయపాటి భావించినప్పటికీ తన తల్లి తుదిశ్వాస విడవటంతో పనులు ఆలస్యమయ్యాయ్. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న బాలయ్య, నందమూరి వీరాభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆనందంలో మునిగితేలుతున్నారట.

Advertisement
CJ Advs

బ్యాక్ టూ బాలయ్య.. ఈ పాత్ర పక్కాగా బాలయ్య కెరీర్‌లో నిలిచిపోతుందని భావిస్తున్నారట. ఎందుకంటే బాలయ్య నటించే పాత్ర అలా ఉంటుందట మరి. మూవీలో బాలకృష్ణ ఆధ్యాత్మిక వేత్తగా కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. ఆధ్యాత్మికతతో పాత్ర మొదలై వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని నెట్టింట్లో ఓ స్టోరీ లైన్ వైరల్ అవుతోంది. ఇది చూసిన బాలయ్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా హడావుడి మొదలుపెట్టేశారు. అందుకే బాలయ్య ప్రస్తుతం గుండు కూడా కొట్టించుకున్నాడని తెలుస్తోంది. అయితే ఆధ్యాత్మిక వేత్త తర్వాత బాలయ్య ఎలా మారబోతున్నాడు..? అనేది మాత్రం బయటికి రాలేదు.

మొత్తానికి చూస్తే బాలయ్యను డిఫరెంట్‌ రోల్‌లో అభిమానులు చూడబోతున్నారన్న మాట. కాగా.. ఇప్పటికే బాలయ్య సరసన ఎవరు నటిస్తారనే విషయంలో త్రిష, శ్రియ, అనుష్క, నయనతార, వేదిక, సోనాల్ చౌహన్‌ ఇలా చాలా పేర్లు ప్రముఖంగా వినపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికింకా బాలయ్యతో రొమాన్స్ చేసేదెవరన్నది క్లారిటీ లేదు. మరోవైపు.. ప్రతి నాయకుడి పాత్ర కోసం సంజయ్ దత్‌ను.. టాలీవుడ్ హీరో శ్రీకాంత్‌ను అనుకున్నారు. సో.. సినిమా హిట్స్ కావాలని కాకుండా జయాపజయాలు లెక్కచేయకుండా ముందుకెళ్తున్న బాలయ్యకు ఈ చిత్రం అయినా సూపర్ హిట్టవుతుందో లేదో వేచి చూడాల్సిందే మరి.

Balayya ‘Gundu’.. Here Reasons..!:

Balayya &lsquo;Gundu&rsquo;.. Here Reasons..! <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs