అక్కినేని నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సూపర్ డూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అయితే అదే ఊపు మీద ఈ కాంబోలో సీక్వెల్ చేసేయాలని భావించినప్పటికీ వర్కవుట్ కాలేదు. అయితే.. ‘బంగార్రాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేశారు. ప్రస్తుతం నాగ్ ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటిస్తుండటంతో ఆ తర్వాత ‘బంగార్రాజు’గా అక్కినేని అభిమానులు, సినీ ప్రియుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో నాగ్ కుమారుడు నాగ చైతన్య అలియాస్ చైతూ కీలక పాత్రలో నటిస్తున్నారన్నదే దాని సారాంశం.
నాగ్-రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాలో.. నాగచైతన్య ముఖ్యమైన పాత్రలో కనిపించి మెప్పిస్తారట. ఈయన పాత్ర ఉండేది కాసేపే అయినా సినిమాకు ఇదే కీలకమట. మరోవైపు.. అనూప్ రూబెన్స్‌ను ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా కళ్యాణ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి మూడో వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభవుతుందట. మరి తాజా చక్కర్లపై క్లారిటీ ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.