Advertisement
Google Ads BL

బన్నీ-సుక్కు మూవీలో అనసూయ పాత్ర ఇదేనట!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిస్తున్న క్రేజీ మూవీ పూజా కార్యక్రమాలతో ఇప్పటికే ప్రారంభమైన సంగతి తెలిసిందే. బన్నీ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. ‘ఆర్య’, ‘ఆర్య- ’2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషమని చెప్పుకోవచ్చు. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అంటే ముగ్గురికీ ముచ్చటగా మూడో సినిమా అన్న మాట. ఈ ముగ్గురూ కలిశారంటే హ్యాట్రిక్ పక్కా అని చెప్పుకోవచ్చు.

Advertisement
CJ Advs

ఇప్పటికే బన్నీ లేకుండానే షూటింగ్ షురూ చేసేసిన సుక్కు సినిమాకు సంబంధించి తాజాగా ఫిల్మ్‌నగర్‌లో ఓ టాక్ నడుస్తోంది. ఈ మూవీలో హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొడ్తున్న యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తోందన్నదే ఈ టాక్ సారాంశం. ఇప్పటికే సుక్కు దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’ నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసింది. అయితే రంగమ్మత్త పాత్ర మాత్రం ఈ ముద్దుగమ్మకు ఓ మంచి గుర్తింపును తెచ్చిందని చెప్పుకోవచ్చు. నటించమంటే జీవించే అనసూయకు తన సినిమాలో ఓ ముఖ్యపాత్ర ఇవ్వాలని భావించి.. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ పాత్ర సృష్టించాడట. 

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అనసూయ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. బన్నీ-అనసూయ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ఊపిరిగా ఉంటాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే బ్యాంకాక్ అడవుల్లో ఈ ఇద్దరికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. పాత్ర నచ్చితే చాలు నటించేసే ఈ బ్యూటీ కథ వినగానే విలన్ పాత్ర అయినా వెనక్కి తగ్గేది లేదని చెప్పేసిందట. వాస్తవానికి యాంకరమ్మ ‘క్షణం’ సినిమాలో కూడా విలన్‌గా నటించేసింది. ఎంతైనా సుక్కు సినిమా కదా.. అడిగితే కాదనలేదుగా.!. ఇన్ని రోజులు యాంకర్, ఆర్టిస్ట్, నటీమణిగా రాణించిన ఈ ముద్దుగుమ్మ విలన్ పాత్ర ఏ మాత్రం కలిసొస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Bunny-Sukku Movie.. Anasuya Role Revealed!:

Bunny-Sukku Movie.. Anasuya Role Revealed!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs