Advertisement
Google Ads BL

RRR ఆ సీన్ లీకవ్వడంపై రాజమౌళి సీరియస్!


ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై అంచనాలు, క్యూరియాసిటీ అన్ని భారీ లెవల్లో ఉన్నాయి. పాన్ ఇండియా మూవీ కాబట్టి రాజమౌళి డైరెక్షన్ కాబట్టి సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. అయితే అంచనాల రేంజ్‌లోనే ఆ సినిమా షూటింగ్ నుండి లీకుల పర్వం కూడా కొనసాగుతుంది. మొన్నటికిమొన్న ఎన్టీఆర్ కొమరం భీం లుక్ సోషల్ మీడియాలో లీకైంది. ఎన్టీఆర్ పాత్రపై క్యూరియాసిటీతో ఆన్ లొకేషన్ నుండి ఎవరో ఒకరు ఆ పిక్ ని లీక్ చెయ్యడం రాజమౌళి అందరికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

Advertisement
CJ Advs

అంత జరిగినా... RRR నుండి లీకుల పర్వం ఆగలేదు. తాజాగా ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే యాక్షన్ సన్నివేశాల తాలూకు విజువల్ ఒకటి బయటికొచ్చింది. ఫైట్ అడవి పులికి, కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ కు మధ్యన జరిగేది. ఈ యాక్షన్ సీన్ సినిమాలో అతి ముఖ్యమైందని.. ఈ యాక్షన్ సన్నివేశం కోసం చాలా బడ్జెట్ పెట్టారని అంటున్నారు. ఎంతో కష్టపడి వ్యయప్రయాసలతో తెరకెక్కించిన ఈ యాక్షన్ సీన్ లీకవడంతో షాక్ తిన్న మూవీ యూనిట్ వెంటనే ఆ విజువల్స్ ని సోషల్ మీడియా నుండి తొలగించినట్లుగా తెలుస్తుంది. ఈలోపే ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు, ఎన్టీఆర్ లుక్ చూసిన అభిమానులు ఎన్టీఆర్ లుక్ మీద రకరకాల పాజిటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు.

SS Rajamouli Serious on RRR leaks:

RRR: Important Fight Scene leaked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs