Advertisement
Google Ads BL

ఉన్నంతలో పాయల్ పర్లేదు.. కానీ..?


బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజపుత్ వెంకీమామతో సేఫ్ అయినప్పటికీ... తన మీదున్న బోల్డ్ ముద్ర చెరుపుకోవడానికి పెద్దగా తాపత్రయ పడుతున్నట్టుగా లేదు. గ్లామర్ షోకి ఎప్పుడు సై అనేలా కనబడుతున్న పాయల్ రాజ్ పుత్.. రవితేజ తో కలిసి డిస్కో రాజాలో నటించింది. ఈ సినిమాలో పాయల్.. చెముడు..మూగ కేరెక్టర్ లో నటించింది. అయితే ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ గత సినిమాలతో పోలిస్తే బాగా కనిపించిందనే చెప్పాలి. కాకపోతే దర్శకుడు ఆమెకి నటించే స్కోప్ ఎక్కువ ఇవ్వలేదు. లేదంటే అభినయంతో పాయల్ రాజపుత్ ఈ సినిమాలో ఆకట్టుకోవడం ఖాయంగా కనబడేది.

Advertisement
CJ Advs

అసలు కథని పక్కనబెట్టి రవితేజని ఎలివేట్ చెయ్యడంలోనే దర్శకుడికి సగం సినిమా సరిపోయింది. హీరోయిన్స్ పాత్రలను దారుణంగా తేల్చేసాడు. ముగ్గురు హీరోయిన్స్‌లో ఉన్నంతలో పాయల్ రాజపుత్ కేరెక్టర్ కాస్త బెటర్‌గా అనిపిస్తుంది. అయితే ఇలా చిన్న చిన్న రోల్స్ కి పరిమితమై సినిమాలు ఒప్పుకోవడం ఎంతవరకు కరెక్టో పాయల్‌కే తెలియాలి. లేదంటే ఆ బోల్డ్ పాత్రలే ఆమెకి గతేయ్యలా కనబడుతుంది. ఎందుకంటే పాయల్ హైట్, ఆమె గ్లామర్ కి సీనియర్ హీరోలు తప్ప మరే హీరోలు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. కాకపోతే చిన్న చిన్న పాత్రలకు, ప్రాధాన్యం లేని పాత్రలకు టెంప్ట్ అవ్వకుండా కాస్త నిడివి ఎక్కువ, ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఒప్పుకుంటే బెటర్. ఇక డిస్కో రాజా గనక హిట్ అయితే.. పాయల్ కి కాస్తో కూస్తో పేరొచ్చేది.. ఇక ఇప్పుడు ఆ సినిమాకొచ్చిన టాక్ వలన పాయల్‌కి పేరు రావడం అటుంచి.. పాయల్‌ని ఎవరూ పట్టించుకోరనిపిస్తుంది. 

Comments on Payal Rajput Role in Disco Raja Movie:

Payal Rajput Deaf and Dumb Role in Disco Raja
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs