Advertisement
Google Ads BL

ఇలా అయితే నభా.. కష్టమే..!


చాలా క్యూట్‌గా, డీసెంట్‌గా, ట్రెడిషనల్‌గా కనబడే నభా నటేష్‌లో ఇంత గ్లామర్ ఉందా అనుకున్నది మాత్రం రామ్ - పూరి కాంబోలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చూసిన తర్వాతే అనిపించింది. తెలంగాణ యాసలో.. సగం సగం బట్టల్తో నభా నటేష్ చేసిన గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. సముద్రపుటంచున.. ఇసుక తెన్నెల్లో రామ్‌తో వేసుకున్న డ్యూయెట్ లో నభా అందాలు ఎంతగా ఆరబొయ్యాలో అంతగా ఆరబోసింది. దెబ్బకి నభా నటేష్ టాప్ లెవల్ కి వెళ్లి కూర్చుకుంది. ఇస్మార్ట్ లో అంతలాంటి నటన, అందాలు ఆరబొయ్యడం చూసాక నభా నెక్స్ట్ మూవీస్ పై ఆమె ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెంచుకుంటారు. కానీ నభా నటేష్ మాత్రం ఫ్యాన్స్ అంచనాలు తన నెక్స్ట్ మూవీతో అందుకోలేకపోయిందనే చెప్పాలి.

Advertisement
CJ Advs

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రవితేజతో డిస్కో రాజాలో నటించింది నభా నటేష్. నిన్న విడుదలైన డిస్కోరాజా టాక్ విషయం పక్కనబెడితే.. ఈ సినిమాలో నభా నటేష్ ను దర్శకుడు కేవలం గెస్ట్ రోల్ కు పరిమితం చేసాడు. ఫస్ట్ సాంగ్ లో చాలా అందంగా కనబడిన నభా నటేష్ పాత్రకి ఈ సినిమా కథలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. నభా నటేష్ గురించి చెప్పుకోవడానికి డిస్కోరాజాలో సీన్స్ ఎక్కడా కనబడవు. ఇస్మార్ట్ తో నభా నటేష్ కి డిస్కో రాజాలో మరింత ప్రాధాన్యం ఉందనుకున్నవారికి.. ఈ సినిమాలో ఆమె పాత్ర చూస్తే  తెలుస్తుంది. మరి కెరీర్‌లో సినిమాలు చెయ్యాలని ఇలాంటి సినిమాలు ఒప్పేసుకుంటూ పోతే... చేతిలో సినిమాల సంగతలా ఉంచి.. చివరికి అవకాశాలే రాకుండా పోయే ప్రమాదముంది.

No Importance to Nabha Natesh Role in Disco Raja:

Nabha Natesh Role in Disco Raja Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs