Advertisement
Google Ads BL

శర్వాతో ఆ సినిమాకి సమంత ఒప్పుకుంటుందా?


తెలుగులో 96 రీమేక్ జాను సినిమాలో శర్వానంద్‌తో జోడికట్టిన సమంత.. ఒరిజినల్ 96లో త్రిష ఎలా ఉందో.. అలానే సమంత జాను పాత్రలో ఒదిగిపోయింది. ఆమె కట్టు, బొట్టు, సింపిల్సిటి అన్నీ త్రిషని చూసినట్టుగానే కనబడుతుంది. విజయ్ సేతుపతి లా శర్వానంద్ కూడా అదరగొట్టేసాడు. ఇప్పటికే విడుదలైన జాను టీజర్ అండ్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచుతుంది. ఇక 96 డైరక్టర్ యే జాను చిత్రాన్ని కూడా తెరకెక్కించడంతో.. ఒరిజినల్ ఫీల్ మిస్ అవ్వకుండా కనబడుతుంది ప్రజంట్ జాను సినిమా. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 7 విడుదల కాబోతుంటే.. సమంత మరోసారి శర్వానంద్‌తో జోడీకట్టే అవకాశం ఉన్నట్టుగా లేటెస్ట్ న్యూస్.

Advertisement
CJ Advs

RX 100 డైరక్టర్ అజయ్ భూపతి మహాసముద్రం కథని ఇద్దరు ముగ్గురు హీరోలకి చెప్పి.... చివరికి శర్వాతో ఓకే చేయించుకున్నాడు. ఆ మహాసముద్రం కథని నాగ చైతన్యకి వినిపించడమే కాదు... చైతుకి జోడిగా సమంతకి కలిపి కథ చెప్పడం.. చైతు కొన్నాళ్ళు అజయ్‌ని హోల్డ్‌లో పెట్టడం జరిగింది. కానీ ఫైనల్‌గా శర్వా‌తో అజయ్ సినిమా ఓకే అయ్యింది. ఇక మొదటి నుండి మహాసముద్రం హీరోయిన్ పాత్రకి అజయ్ భూపతి సమంతానే అనుకోవడం, చైతు ఈ స్క్రిప్ట్ ఒప్పుకుంటే.. చైతు - సామ్ జంట హీరోహీరోయిన్స్‌గా క్రేజ్ వస్తుంది అనుకున్నాడు. అజయ్ కి చైతు హ్యాండ్ ఇవ్వడంతో.. శర్వాని ఓకే చేసుకున్నాడు అయితే సమంతనే శర్వా కోసం హీరోయిన్ గా తేవడానికి అజయ్ ఫిక్స్ అయ్యాడట. మరి జాను సినిమాతో పాటుగా సమంత, శర్వాతో మహాసముద్రం చెయ్యడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Who is Mahasamudram Heroine?:

Samantha again pair up with Sharwanand?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs