Advertisement
Google Ads BL

కంగనా అకౌంట్‌లో ఇంకోటి వేసుకోండి!


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరు వింటేనే చాలామందికి వెన్నులో ఒణుకు పుడుతుంది. కారణం కంగనా రనౌత్ ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారి టార్గెట్ చేసింది అంటే అస్సలు వదలదు.. వాళ్ళని ఏళ్ళ తరబడి వెంటాడుతూనే ఉంటుంది. మణికర్ణిక సినిమాతో వివాదాలకు నెలవుగా మారిన కంగనా ఇప్పుడు ‘పంగా’ అనే లేడి ఓరియెంటెడ్ మూవీతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో కంగనా జయ పాత్రలో చెలరేగిపోయింది. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పంగా సినిమాకి హిట్ టాక్ పడినట్లే కనబడుతుంది. మరి ఈ సినిమా కోసం కబడ్డీ లో రెండు నెలల పాటు శిక్షణ కూడా పొందింది.

Advertisement
CJ Advs

ఇంతకీ పంగా కథ అందరికి తెలిసిందే. కబడ్డీలో అదరగొట్టే జయ... అందరి మన్ననలు అందుకుంటూ టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని బిడ్డని కన్నాక ఆ గుర్తింపు పోవడంతో పాటుగా కనీసం తన ఆట గురించి కానీ తన గురించి కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో.. కలత చెందిన జయ మళ్ళీ కబడ్డీ ఆడి గెలవాలని పట్టుదలతో ఉండడంతో.. తన కుటుంబం కూడా జయకి సపోర్ట్ చెయ్యడంతో.. జయ మళ్ళీ తిరిగి కబడ్డీ ఆట మొదలుపెడుతుంది. మరి జయ ఆ వయసులో మళ్ళీ కబడ్డీలో సక్సెస్ సాధించిందా? ఆ క్రమంలో జయ ఎదుర్కున్న సమస్యలేమిటో? అనేది మిగతా కథ. మరి ఈ సినిమాని అందరు ఆడవాళ్ళూ చూసి ఇన్స్పైర్ అవ్వాలని.. సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుంది అని ‘పంగా’ చూసిన ప్రేక్షకులు చెబుతున్న మాట.  

Good Reports to Kangana Panga Movie:

Panga Movie Report at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs