Advertisement
Google Ads BL

మెగా హీరోల్ని చుట్టేస్తున్న విజయ్ సేతుపతి!


విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. హీరో మెటీరియల్ కాకపోయినా... అదిరిపోయే నటనతో.. అందివచ్చిన అవకాశాలతో అందరి మన్ననలు పొందుతున్న హీరో. విలన్ రోల్ అయినా, కేరెక్టర్ ఆర్టిస్ట్‌గానైనా, హీరోగానైనా అదరగొట్టేస్తాడు. తమిళనాట మాత్రమేనా తెలుగు, హిందీ ఏ భాషలోనైనా తనకి మంచి పాత్ర వస్తే చాలు విలన్ రోలా.. సపోర్టింగ్ రోలా అనేది చూడడు. తమిళనాట హీరో అవకాశాలు తెలుగులో విలన్ అవకాశాలు, హిందీలోనూ విలన్ అవకాశాలు చేస్తూ ఒక్క క్షణం తీరిక ఉండదు. తాజాగా తెలుగులో మెగా హీరోలందరిని వరసబెట్టి చుట్టేస్తున్నాడు విజయ్ సేతుపతి. సైరాలో చిరుకి సపోర్టింగ్ రోల్ చేసిన విజయ్ సేతుపతి వైష్ణవ తేజ్ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో విలనిజాన్ని పండిస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చెయ్యడమే కాదు.. భారీ పారితోషకం కూడా అందుకుంటున్నాడు. ఇక మరో హీరో అల్లు అర్జున్ - సుకుమార్ సినిమాలోనూ విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయబోతున్నాడనే ప్రచారం ఉంది. క్లారిటీ లేదు. ఇక తాజాగా మరో మెగా హీరో సినిమాలో విజయ్ సేతుపతి పేరు వినబడుతుంది. వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా కోసం విజయ్ సేతుపతి పేరుని విలన్ పాత్రకి పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు ఉన్న ప్రాధాన్యం వలన విజయ్ సేతుపతి అయితే ఆ పాత్రకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని వరుణ్ - కిరణ్ భావిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఒకవేళ విజయ్ సేతుపతి ఖాళీ లేకపోతే మరొక విలక్షణ నటుణ్ని తీసుకురావాలని మూవీ టీం భావిస్తోందట.

Vijay Sethupathi in One More Mega Hero Film:

Vijay Sethupathi Villain in Varun Tej Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs