వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఫస్ట్ లుక్ విడుదల, ఏప్రిల్ 2 సినిమా విడుదల
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదలయింది. ఆ పోస్టర్లో కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ ధరించి ఉన్న వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపిస్తున్నాడు.
తొలి సినిమా కోసమే తన శరీరాకృతిని మార్చుకున్న అతను చాలా చురుగ్గా కనిపిస్తున్నాడు. పోస్టర్లో అతని బాడీ లాంగ్వేజ్ లోని టెంపరమెంట్, సముద్రం.. సినిమా టైటిల్ కు యాప్ట్ అనిపిస్తున్నాయి. వచ్చే వేసవిలో ఏప్రిల్ 2న మూవీని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్ గా పనిచేసిన బుచ్చిబాబు సాన ‘ఉప్పెన’తో దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాతో కృతి శెట్టి నాయికగా టాలీవుడ్ లో అడుగుపెడుతుండగా, తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక ప్రధాన పాత్ర చేస్తున్నారు.
‘రాక్ స్టార్’ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మ్రైతీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ కలిసి ఉప్పెనను నిర్మిస్తోంది.
తారాగణం: పంజా విష్ణవ్ తేజ్, విజయ్ సేతుపతి, కృతి శెట్టి, సాయిచంద్, బ్రహ్మాజీ
సాంకేతిక వర్గం:
కథ, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అనిల్ వై.
సీఈవో: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి, విఎఫ్‌ఎక్ట్స్: యుగంధర్.టి
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రఫీ: శాందత్ సైనుద్దీన్
మ్యూజిక్ డైరెక్టర్: దేవి శ్రీప్రసాద్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: మౌనిక రామకృష్ణ
పీఆర్వో: వంశీ-శేఖర్, మధు మడూరి