Advertisement
Google Ads BL

పవన్ విషయంలో దిల్ రాజు ఇంత తగ్గాడేంటి?


దిల్ రాజుకి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనే కోరిక ఇప్పటిది కాదు. ఆ కోరికను పవన్ పింక్ రీమేక్ తో తీర్చేసాడు. పవన్ కళ్యాణ్‌తో కాస్ట్లీ వ్యవహారమని చెప్పినా దిల్ రాజుకి పవన్ క్రేజ్ ముందు ఏది వినబడడం లేదు. అందుకే పవన్‌కి సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ పారితోషకం ఇవ్వడానికి రెడీ అవ్వడమే కాదు.. పవన్ కళ్యాణ్ రోజుకి రెండు గంటలే షూటింగ్ అన్నా పర్వాలేదని తలూపాడు. మరి పవన్ సినిమాలు, రాజకీయాలను రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు అంటే.. దిల్ రాజు లాంటి నిర్మాత దొరకబట్టే. అన్నిటిలో పట్టుబట్టే దిల్ రాజు పవన్ విషయంలో కామ్‌గా ఉన్నాడు. ఎందుకంటే దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న టైమ్‌లో.. కనివినీ ఎరుగని లాభాలను తెచ్చిపెట్టింది పవన్ కళ్యాణ్ చిత్రమే. ఈ చిత్రం నుంచి దిల్ రాజు ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అందుకే పవన్ అంటే దిల్ రాజుకు ప్రత్యేకమైన అభిమానం. తాజాగా పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు ఎంత కాస్ట్లీ యవ్వారం నడుపుతున్నాడో అనేది అందరికీ షాకిస్తున్న న్యూస్.

Advertisement
CJ Advs

అదేమిటంటే పవన్ ఉదయం సినిమా సాయంత్రం రాజకీయాలంటూ.. మార్నింగ్ హైదరాబాద్.. ఈవినెంగ్ అమరావతిలో కనబడుతున్నాడు. దానికి గాను దిల్ రాజు ఏకంగా పవన్ కళ్యాణ్ కంఫర్ట్ కోసం ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌ని ఎరేంజ్ చేసాడనే న్యూస్ ఉంది చూడండి.. దిల్ రాజుకి పవన్‌తో సినిమా చేసే పిచ్చి పీక్స్‌లో ఉందనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఆ ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్‌లోనే షూటింగ్‌తో పాటు రాజకీయాల కోసం పరుగులు పెడుతున్నాడు. మరి రోజుకి నాలుగు లక్షలు ఆ చార్టెడ్ ఫ్లైట్ కోసం దిల్ రాజు ఖర్చు చేస్తున్నాడట. ఆ లెక్కన పవన్ కళ్యాణ్ షూటింగ్‌కి హాజరైనన్ని రోజులు దిల్ రాజుకి తడిసిమోపుడవ్వడం ఖాయంగా కనబడుతుంది.

Dil Raju Arranged flight for Pawan Kalyan?:

Dil Raju and Pawan Kalyan: This is the Matter.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs