విడుదలైంది మొదలు ‘అల వైకుంఠపురములో’ థియేటర్స్‌లో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ క్రేజ్ కాదు.. అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్న జనాలు అల వైకుంఠపురములో అంటూ ఇప్పటికీ థియేటర్స్‌కి క్యూ కడుతున్నారు. ఫస్ట్ వీక్‌లోనే దంచి కొట్టిన అల వైకుంఠపురములో.. రెండో వారంలోను ఎక్కడా తగ్గడం లేదు. సెకండ్ వీకెండ్‌లోను అల వైకుంఠపురములో కలెక్షన్స్ అదిరిపోగా.. సెకండ్ వీక్ సోమ, మంగళవారాల్లో 50 నుండి 70 శాతం థియేటర్స్ ఆక్యుపెన్సీ కనబడుతుంది అంటే.. అల ఎక్కడా ఆగడం లేదనిపిస్తుంది. ఇప్పటికీ బుక్ మై షోలో టికెట్స్ హాట్ కేకులా అమ్ముడుపోతున్నాయి.
మరోపక్క సరిలేరు నీకెవ్వరు థియేటర్స్‌లో ప్రేక్షకులు డల్ అయ్యారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు ఎంతగా హిట్ అన్నప్పటికీ.. రిపీటెడ్ ఆడియన్స్ ఆ సినిమాకి కరువయ్యారు. కాబట్టి అల వైకుంఠపురములో కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. మరోపక్క అల్లు అర్జున్ హవా ఓవర్సీస్‌లోనూ నడుస్తూనే ఉంది. అక్కడ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రాబడుతున్నాడు. మరోపక్క మహేష్ సరిలేరు నీకెవ్వరు ఓవర్సీస్‌లోనూ డల్ అయ్యింది. మరి రెండో వారం కింగ్ అలా వైకుంఠపురములోనే.. ఇది ఫిక్స్.