Advertisement
Google Ads BL

‘ఫైటర్’.. వాళ్లు ఎలా అంటే అలా ఆడించాల్సిందే!


పూరి జగన్నాధ్ చెప్పిన ‘ఫైటర్’ స్క్రిప్ట్ నచ్చి విజయ్ దేవరకొండ ఈ స్క్రిప్ట్‌తో పాన్ ఇండియా సినిమా చెయ్యాల్సిందే అని.. బాలీవుడ్ కరణ్ జోహార్‌కి ఫైటర్ స్క్రిప్ట్ వినిపించి... ఆఖరుకి కరణ్ జోహార్ ని ఫైటర్ సినిమాలో భాగస్వామిని చేసారు. పూరి జగన్నాధ్ కి కూడా బాలీవుడ్ స్నేహాలున్నప్పటికీ.... విజయ్ దేవరకొండ క్రేజ్ తో ఫైటర్ బాలీవుడ్ లో కూడా నిర్మించడం తేలికైంది. అయితే బాలీవుడ్ టార్గెట్ గా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా విషయంలో ఇప్పుడు బాలీవుడ్ పెత్తనమే కనబడుతుంది.

Advertisement
CJ Advs

బాలీవుడ్ హీరోయిన్ దగ్గరనుండి... టైటిల్ వరకు. ముందునుండి పూరి జగన్నాధ్ ఫైటర్ స్క్రిప్ట్ రాసుకున్నప్పటినుండి... ఫైటర్ టైటిల్ కి కనెక్ట్ అవడం ఆ టైటిల్ నే ప్రకటించడం జరిగింది. అయితే తాజా సినిమా ఓపెనింగ్ అప్పుడు ఫైటర్ టైటిల్ ని రివీల్ చెయ్యలేదు. కారణం అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండాలని, ఫైటర్ టైటిల్ కరణ్ జోహార్ కి అంతగా నచ్చకపోవడంతో.. మరో టైటిల్ కోసం వెతుకులాటలో ఫైటర్ టైటిల్ ని ఎనౌన్స్ చెయ్యలేదని చెబుతున్నారు. అలాగే ముంబై, గోవాలో జరిగే ఫైటర్ షూటింగ్ చిత్రీకరణను, కరణ్ జోహార్ టీం దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తుందని అంటున్నారు. మరోపక్క కరణ్ జోహార్ ఇన్వాల్మెంట్ తో ఈ సినిమాకి క్రేజ్ వస్తుంది కాబట్టి.. పూరి కూడా కరణ్ ఎలా అంటే అలా అన్నట్లుగా మారిపోతున్నాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

Bollywood Authority on Vijay and Puri Fighter:

Karan Johar Wants Fighter Title Change
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs