సాయి పల్లవి - నాగ చైతన్య జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చైతు మజిలీ తో సూపర్ హిట్, వెంకిమామతో హిట్ అందుకోవడం, ఫిదా లాంటి లవ్ స్టోరీనే శేఖర్ కమ్ముల తెరకెక్కించడం, టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఏప్రిల్ లో విడుదల టార్గేట్ గా తెరకెక్కుతున్న ఈసినిమా పై ఓ న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరు ఈ సినిమాలో పల్లెటూళ్లకు చెందిన అబ్బాయి, అమ్మాయిగా కనిపించనున్నారని... పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందని తెలుస్తుంది. అయితే లవ్ స్టోరీ లో హ్యాపీ ఎండింగ్ ఉండదని.. ఈ సినిమా క్లైమాక్స్ విషాదాంతంగా దర్శకుడు రాసుకున్నాడు అని... నాగ చైతన్య పాత్ర సినిమా చివరిలో చనిపోతుందని.. సాయి పల్లవి మాత్రం చైతు జ్ఞాపకాలతో.. జీవితాంతం ఒంటరిగా మిలిపోతుందని అంటున్నారు. ఇక ఈ కథలో ఎంతో ఎమోషన్ ఉంటుందని.. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో ప్రేక్షకుడు కంటతడి పెడతాడని అంటున్నారు.