Advertisement
Google Ads BL

‘డిస్కోరాజా’.. ట్రైలర్ ఏది..?


రవితేజ ‘డిస్కోరాజా’ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఎందుకంటే రెండు డిజాస్టర్‌తో కాస్త వెనకబడిన రవితేజ ‘డిస్కోరాజా’తో ఎలాగైనా హిట్ కొట్టాలని... కాదు కొడుతున్నాం అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు కూడా. అయితే రవితేజ క్రేజ్‌కి బ్రేకులేసిన డిజాస్టర్స్‌తో ‘డిస్కోరాజా’పై భారీ అంచనాలు లేకపోయినా.. రవితేజ ప్రమోషన్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నాడు. ఇక ఈ శుక్రవారం రాబోతున్న ‘డిస్కోరాజా’ సెన్సార్ కూడా పూర్తయ్యింది. యుబైఏ సర్టిఫికెట్‌తో ‘డిస్కోరాజా’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమాపై ఎంత అంచనాలున్నప్పటికీ... ప్రేక్షకులు, అభిమానులు ఆ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తారు.

Advertisement
CJ Advs

మరి అందరూ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కో, లేదంటే ప్రత్యేకించి ట్రైలర్ రిలీజ్ అంటూ హడావిడీ చేస్తూ ఆయా సినిమాల ట్రైలర్స్ రిలీజ్ చేస్తుంటారు. కానీ రవితేజ ‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాడు... ట్రైలర్ రిలీజ్ చేయలేదు. కానీ అభిమానులేమో డిస్కోరాజా ట్రైలర్ కోసం వెయిటింగ్ అంటున్నారు. ప్రేక్షకులు కూడా డిస్కోరాజా ట్రైలర్ చూసి సినిమాకి పోదామనే ధ్యాసలో టికెట్ బుకింగ్స్ చేస్తారు. కానీ రవితేజ ట్రైలర్ ఇస్తాడో... లేదంటే.. ఏకంగా సినిమానే చూపెడతాడో అనేది క్లారిటీ లేదు. అందుకే డిస్కోరాజా విషయంలో ఏదో మిస్ అయ్యింది అనే భావన కలుగుతుంది. కనీసం ట్రైలర్ రిలీజ్ చేయకపోవడానికి కారణం ఏమిటో అయినా చిత్రయూనిట్ చెప్పి ఉంటే బాగుండేది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. రెండు టీజర్స్‌కు వచ్చిన క్రేజ్, థమన్ సాంగ్స్ ఇచ్చిన ఎనర్జీతో ఈ సినిమాని ట్రైలర్ లేకుండానే రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ భావించిందేమో.. ఏది ఏమైనా ఈ విషయంలో చిత్రయూనిట్ ఏదో క్లారిటీ ఇస్తే బాగుండేది అని మాస్ మహారాజా ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Fans Waiting for Raviteja Disco Raja Trailer:

No Trailer to Raviteja Disco Raja Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs