Advertisement
Google Ads BL

శాలరీ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన మాస్‌రాజా!


టాలీవుడ్‌లో లేట్ వయసులో హీరోగా మారి.. ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్‌తో దూసుకుపోయిన రవితేజ హిట్స్, ప్లాప్స్‌తో కెరీర్ లాగించేస్తున్నాడు. వరసగా మూడు డిజాస్టర్స్‌తో ఉన్న రవితేజ ‘డిస్కోరాజా’తో ఈ శుక్రవారం ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. అయితే రవితేజ పారితోషకం విషయంలో ఏ మాత్రం తగ్గడని.. సినిమాలు డిజాస్టర్స్ అయినా పారితోషకం విషయంలో పక్కాగా ఉంటాడనే ప్రచారం ఉంది. పారితోషకం సెట్ కాకపోతే సినిమాలు వదిలేస్తాడనీ అంటుంటారు. అయితే రవితేజ కూడా అదే చెబుతున్నాడు. నా స్థాయి, నా క్రేజ్ ని బట్టే నా పారితోషకం ఉంటుంది అంటున్నాడు.

Advertisement
CJ Advs

నా శాలరీ 1000 ఉన్నప్పుడు నేను 800 తీసుకోవడంలో అర్ధం లేదని వాదిస్తున్నాడు. అయితే సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా తనదే బాధ్యత కానీ.. ఆ విషయంలో నేను ఎవరిని నిందించనని.. అలాగే నేను ఓసారి సినిమా ప్లాప్ అయినప్ప్పుడు నిర్మాత ఇచ్చిన చెక్ కూడా చింపేసానని చెబుతున్నాడు. మరి కెరీర్ డౌన్ ఫాల్ అయినపుడు పారితోషకం విషయంలో నిక్కచ్చిగా ఉంటే.. నిర్మాతలు ఆయా హీరోలను పక్కనబెట్టడం ఎంత సేపో పట్టదు. అయినా నేను ఇలానే ఉంటా అంటే ఎవ్వరూ ఏమి చెయ్యలేరు కదా.

Raviteja Talks About Remuneration:

Raviteja Latest Interview Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs