Advertisement
Google Ads BL

ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ కొడుతున్నా: బన్నీ


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే ‘అల వైకుంఠపురములో’ మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నాన్-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

Advertisement
CJ Advs

ఈ ఉత్సవంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘‘నా ఫస్ట్ సినిమా ఇక్కడ (వైజాగ్) షూట్ చేశాను. ఇప్పటికి ఇరవై సినిమాలు చేశాను. నా విజయం, నా జర్నీ ఎప్పుడూ వైజాగ్ ప్రజలతోనే ఉంది. మళ్లీ వైజాగ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకరు నాతో ‘ప్రతి ఒక్కరికీ ఒక కంచుకోట ఉంటుంది. మీ కంచుకోట వైజాగ్ అండీ’ అన్నారు. నిజంగా అది కలెక్షన్లు చూస్తే తెలుస్తుంది. థాంక్యూ వెరీ మచ్ వైజాగ్. నా మొట్టమొదటి థాంక్యూ తెలుగు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఫోన్లో వొచ్చేస్తున్నాయ్, టీవీలో వచ్చేస్తున్నాయ్, థియేటర్లకు జనం రావట్లేదు అనే టైంలో.. మీరు మంచి సినిమా ఇవ్వండి, మేం తెలుగువాళ్లం అందరం కలిసికట్టుగా థియేటర్లకు వచ్చి చూస్తాం.. అని చెప్పిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. 

ఎలాంటి ఆల్బమ్ కావాలని తమన్ అడిగాడు. 1 బిలియన్ వ్యూస్ వచ్చే ఆల్బమ్ కావాలన్నాను. నిజంగా తను 1 బిలియన్ వ్యూస్ వచ్చే ఆల్బమే ఇచ్చాడు. మాట నిలబెట్టుకున్నందుకు అతనికి థాంక్స్. ‘సామజవరగమన’ పాటతో ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు. ప్రపంచమంతా ఇది అతనికిచ్చిన బిరుదు. అలాగే ‘రాములో రాములా’తో ‘చార్ట్ బస్టర్ ఆఫ్ ది ఇయర్’ అనిపించుకున్నాడు. అలాగే ఒక దాన్ని మించి ఒకటి అన్నట్లుగా ‘ఓ మైగాడ్ డాడీ’, ‘బుట్టబొమ్మ’, ‘అల వైకుంఠపురములో’, ‘సిత్తరాల సిరపడు’ పాటలు ఇచ్చి, ‘ఆల్బం ఆఫ్ ద డికేడ్’ అనిపించుకున్నాడు. నిజంగా తమన్ నేను ఇష్టపడే మ్యూజిక్ డైరెక్టర్. ఎంతో కష్టపడుతూ వచ్చి ఈ సినిమాతో టాప్ మ్యూజిక్ డైరెక్టరుగా కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటాన్ని ఈ డికేడ్ అంతా దింపకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మిగతా టెక్నీషియన్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేడం సార్ మేడం అంతే అన్నట్లు పూజా తెలుగులో బాగా మాట్లాడింది. టబు గారు, ఈశ్వరీరావు, రోహిణి వంటి చాలామంది ఆడవాళ్లు చేశారు. వాళ్లందరికీ నీరాజనంగా ఈ సినిమాలోని డైలాగ్.. ‘దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటివాళ్లతో మనకు గొడవేంటి సార్. సరండరైపోవాలంతే’. 

‘జులాయి’తో మేం మొదలుపెట్టిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌తో ఇప్పుడు మూడో సినిమా చేశాను. తన హీరోని ఒక మెట్టు పైకెక్కించాలనే ప్రేమతో నిర్మాత రాధాకృష్ణగారు సినిమాలు తీస్తారు. ఆయనకు థాంక్స్. ఇక నన్ను ‘గంగోత్రి’తో హీరోగా పరిచయం చేసిన మా నాన్న, ఆ తర్వాత ‘బన్నీ’, ‘హ్యాపీ’, ‘బద్రినాథ్’, ‘రేసుగుర్రం’, ‘సరైనోడు’, ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ తీశారు. ఆయనకు థ్యాంక్స్. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా హిట్టు మాత్రం ఒక్క డైరెక్టర్‌గారే ఇస్తారు. మా అందరికీ హిట్టిచ్చిన త్రివిక్రమ్‌గారికి థాంక్స్. సినిమాని ఒక పెయింటింగ్ అనుకుంటే, దానికి హీరో ఒక కాన్వాస్ కావచ్చు. ఆ కాన్వాస్ నిలిపే ఫ్రేం ఒక ప్రొడ్యూసర్ అవ్వొచ్చు. ఆ పెయింటింగ్ వేసే బ్రష్‌లు టెక్నీషియన్స్ అవ్వొచ్చు. ఆ పెయింటింగ్ మీద మేగ్నిఫిసియంట్ కలర్స్ ఆర్టిస్టులు అవ్వొచ్చు. కానీ ఈ మొత్తం పెయింటింగును ఊహించి, తనొక్కడే గీసి, దానికి ఒక రూపం తీసుకొచ్చే ఆర్టిస్టే డైరెక్టర్. అలాంటి త్రివిక్రమ్ గారి గురించి నేనెంత చెప్పినా తక్కువే. నేను చాలా సినిమాలు చేశాను. అందులో నేను అది బాగా చేశాను, ఇది బాగా చేశానని చెప్తారు. కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎవరు ఫోన్ చేసినా నా పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పారు. అంతటి గిఫ్ట్ నాకిచ్చారు త్రివిక్రమ్ గారు. మా నాన్నగారు ఎన్నో హిట్లు తీశారు. చిరంజీవి గారితో కోకొల్లలుగా హిట్లు తీశారు. ఇండస్ట్రీ హిట్లు తీశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. చరణ్‌తో ‘మగధీర’ తీసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. హిందీలో ఆమిర్‌ఖాన్‌తో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టారు. ఎప్పటికైనా మా నాన్నగారితో ఒక్క ఇండస్ట్రీ రికార్డ్ సినిమా కొట్టాలి అనుకొనేవాడ్ని. నిజంగా ఈ సినిమాతో ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ కొడుతున్నా. ఇది నాకు స్వీటెస్ట్ మెమరీ. మా నాన్నతో కలిసి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టడమనే ఆనందం త్రివిక్రమ్గారిచ్చారు. ఇదొక్కటి చాలు.. థాంక్యూ సో మచ్. ఎవరితో రికార్డ్ కొట్టినా ఇంత ఆనందం సంపూర్ణంగా ఉండేది కాదు. మా మొత్తం ఫ్యామిలీ తరపున థాంక్యూ సర్. చివరగా నా ఫ్యాన్స్ కు థాంక్యూ. 

ఇవాళ పొద్దున వైజాగ్‌కు వస్తుంటే 500 బైకులు ర్యాలీగా వచ్చాయి. వాటిని చూసి పూజ ‘హౌ డు యు ఫీల్ అర్జున్?’ అనడిగింది. పూజా.. ఒకటిన్నర సంవత్సరం గ్యాప్ తీసుకొని, ఒక రూములో ఒక ఖాళీ గోడమీద ఏమీ లేనిచోట నేనది ఊహించా.. వాళ్లలా వస్తారని. అది ఈవేళ నా కళ్లారా చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. మొన్న చెప్పిందే మళ్లీ చెప్తున్నా. ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. మీరందరూ గర్వించే స్థాయివరకూ నేను వెళ్తాను. ఇది నా మొదటి మెట్టు. ఈ మొత్తం దశాబ్దం ఎలా చేశానని చూసుకుంటే నాకు సంతృప్తి కలగలేదు. ఇలా చేశానేమిటి, ఇంకా గొప్పగా చెయ్యాలి కదా.. అనుకున్నాను. ఏదైనా బలం కావాలనిపించింది. 2020 మొదట్లో ఆ బలం చూపించిన ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కచ్చితంగా ఇది నా మొదటి అడుగుగా భావించి, మీ దీవెనలు తీసుకొని, మీ అందరికీ దండం పెట్టుకొని ముందుకు వెళ్లాలనుకుంటున్నాను. ఎప్పట్నించో నన్ను సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. మెగా అంటే అందరం. ఇవాళ సినిమా ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ సినిమాగా నిలవబోతోంది. ఒక గొప్ప సినిమా చూసిన ఫీలింగ్ శాశ్వతం. రికార్డులనేవి వెరీ వెరీ టెంపరరీ. ఇప్పుడు నేను కొడతాను, ఆర్నెల్ల తర్వాత ఇంకొకరు కొడతారు. అలా కొడుతూనే ఉంటారు. మీ మనసుకి ఎంజాయ్మెంట్ ఇచ్చాను కదా, అది అమూల్యమైంది. దానిముందు రికార్డులనేవి నథింగ్. ఒక్క మాటలో చెప్పాలంటే రికార్డ్స్ ఆర్ టెంపరరీ, ఫీలింగ్స్ ఆర్ ఫరెవర్’’ అని చెప్పారు.

Allu Arjun Speech at Ala Vaikunthapurramuloo Success Celebrations:

<span>Ala Vaikunthapurramuloo Success Celebrations highlights</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs