Advertisement
Google Ads BL

కీర్తి సురేష్ వదిలేసిన పాత్రలో సీనియర్ నటి!


మహానటి తర్వాత కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి అజయ్ దేవగన్ మైదాన్ సినిమాతో ఎంట్రీకి ఏర్పాట్లు జరిగాయి. ఒక్కసారిగా తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్తో బిజీ తారగా మారిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్‌ని వదులుకుంది. కారణం ఆమె అజయ్ దేవగన్ భార్య పాత్రలో మైదాన్‌లో కనిపించాలి. అయితే అంత సీనియర్ హీరో ముందు కీర్తి సురేష్ మరీ యంగ్‌గా సన్నగా కనిపించడంతో.. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసిన కీర్తి సురేష్.. అజయ్ పక్కన మరీ తేలిపోయానని.. అందుకే కీర్తి సురేష్ నిర్మాత బోనితో సంప్రదించి మరీ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా బాలీవుడ్ మీడియా కథనం. మహానటి తర్వాత బాగా సన్నగా నాజూగ్గా మారిన కీర్తికి ఇప్పుడు ఆమె బరువు తగ్గడం శాపంగా మారింది.

Advertisement
CJ Advs

అయితే కీర్తి సురేష్ మైదాన్ నుండి బయటికి రావడంతో.. అజయ్ దేవగన్ భార్య రోల్‌ ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ప్రియమణి చెంతకి చేరింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ఒకటీ అరా పాత్రలతో కెరీర్‌లో ముందుకెళుతున్న ప్రియమణి తాజాగా ద ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్‌తో ఇరగదీసింది. ఇక కీర్తి సురేష్ మైదాన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అజయ్ సరసన ప్రియమణి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని.. చిత్ర బృందం ఆమెని సంప్రదించడం... ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయనే టాక్ బాలీవుడ్ ఫిలింసర్కిల్స్‌లో వినబడుతుంది. ఒక వేళ ఈ చిత్రం రేపు విడుదలయ్యాక పెద్ద సక్సెస్ అయితే.. అప్పుడు కీర్తి రియాక్షన్ ఎలా ఉంటుందో మరి. 

Senior Actress Replaces Keerthi Suresh In Bollywood Film:

Keerthi Suresh Out.. Priyamani In for Bollywood Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs