Advertisement
Google Ads BL

బంటూ ముందు.. బన్నీ వెనకాల: త్రివిక్రమ్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల్ని బద్దలుకొడుతూ దూసుకుపోతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. మొదటి వారంలోనే ‘అల వైకుంఠపురములో’ మూవీ 180 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ నాన్-బాహుబలి2 రికార్డుల్ని సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వైజాగ్ లో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

Advertisement
CJ Advs

ఈ ఉత్సవంలో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘‘నేను వైజాగ్‌లోనే చదువుకున్నా. వైజాగ్ అంటే నాకు గుర్తొచ్చేవి అందమైన అమ్మాయిలు, ఆంధ్రా యూనివర్సిటీ, ఆహ్లాదకరమైన బీచ్. శ్రీశ్రీ, చలం గారు, రావిశాస్త్రి గారు, సీతారామశాస్త్రి‌గారు వంటి సాహితీపరుల్ని అందించిన మహానగరం ఇది. ఈ సినిమాని తన భుజం మీద మోసుకుంటూ తీసుకొచ్చిన తమన్‌కు థాంక్స్. విలువలతో సినిమా తియ్యండి, మేమెందుకు ఆదరించమో చూపిస్తామని మీరంతా చెప్పారు. అది మాకే కాదు, తెలుగు సినిమాకే నమ్మకాన్నిచ్చింది. పూజా హెగ్డే, టబు గారు, నివేదా పేతురాజ్, రోహిణి‌గారు పోషించిన గౌరవప్రదమైన స్త్రీ పాత్రల్ని మేం గుండెల్లో పెట్టుకుంటామని వాళ్లను ప్రేమించి ఈ సినిమాని మీరంతా అంత ముందుకు తీసుకువెళ్లారు. మీ సంస్కారానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. చెన్నైలో పుట్టి పెరిగిన తెలుగువాడు సినిమాటోగ్రాఫర్ వినోద్, వైజాగ్ వాడైన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ కలిసి ఈ సినిమాని విజువల్‌గా వేరే స్థాయికి తీసుకువెళ్లారు.

అన్నింటికీ మించి ఈ కథను విన్నప్పటి నుంచీ ఈ రోజు దాకా వదిలేయకుండా ముందుండి నడిపించిన మన బన్నీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఒక ఆఫీస్ బాల్కనీలో మొదలుపెట్టిన ఈ ప్రయాణాన్ని వైజాగ్ ఆర్కే బీచ్ దాకా విజయవంతంగా తీసుకువచ్చి ఈ కథకీ, ఈ సినిమాకీ తనే నాయకుడై నడిపించిన మన కథానాయకుడు బన్నీ. అతనిలో ఎంత పరిణితి కనిపించిందని, మేమేం అనుభూతికి లోనయ్యామో మీరందరూ అదే అనుభూతికి లోనయ్యామని మీరు చెబుతుంటే ఆనందించాం. తను ఇంటర్వెల్లో కనిపించే దృశ్యాల్లో కానీ, క్లైమాక్సులో యాక్ట్ చేసిన దృశ్యాల్లో కానీ, కామెడీ పండించడంలో కానీ, సెంటిమెంటులో కానీ, పాటలు కానీ, ఫైట్లు కానీ.. బంటూని ముందుపెట్టి బన్నీ వెనకాల నిల్చున్నాడు. ఇది చాలా పరిణితితో చెయ్యాల్సిన ఫీట్. కమర్షియల్ హీరోకి రేజర్ ఎడ్జ్ మీదుండే ఫీట్. కొంచెం అటైనా, ఇటైనా అభాసుపాలైపోయే ఫీట్. ఇంత రిస్కుని బలంగా నమ్మి ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకురాగలిగిన బన్నీ.. నాకు తెలిసి తెలుగు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లగలడు. ఆయన సినిమాని ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలుసు కాబట్టి, మన నేల నుంచి మన కథని గొప్ప సినిమాలుగా ప్రపంచం నలుమూలలకీ చెప్పేంత శక్తిని ఆయనకు మనమందరం ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

Trivikram Srinivas Speech at Ala Vaikunthapurramuloo Success Celebrations:

Ala Vaikunthapurramuloo Success Celebrations highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs