Advertisement
Google Ads BL

అక్కడ ‘బంటూ’ని మహేష్ బీట్ చేయగలడా?


సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘సరిలేరు నీకెవ్వరు’ పండక్కి వచ్చి మాస్ హిట్ కొడితే.. ఒక రోజు లేట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇక అప్పటినుండి రెండు సినిమాల కలెక్షన్స్ విషయంలో సోషల్ మీడియాలో వార్ జరిగితే ఓకే.. కానీ నిర్మాతలే మా సినిమాకి ఇంతొచ్చింది, అంతొచ్చింది అంటూ పోస్టర్స్ మీద పోస్టర్స్ విడుదల చేస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మహేష్ గొప్ప అంటే అల్లు అర్జున్ గొప్ప అంటూ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్ పీక్స్ లో ఉంటే.. హైయ్యస్ట్ గ్రాసర్స్ అంటూ పోస్టర్స్ యుద్ధం మొదలయ్యింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొద్దిగా అటుఇటుగా రెండు సినిమాలు కలెక్షన్స్ ఉంటున్నాయి. కానీ ఓవర్సీస్‌లో మాత్రం అల్లు అర్జున్.. మహేష్ సినిమాని ఊహించనంతగా బీట్ చేశాడు.

Advertisement
CJ Advs

‘అల వైకుంఠపురములో’ ఇప్పటికే 2 మిలియన్ క్లబ్బులో చేరితే.. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా అసలు ఈ మార్కును చేరుకోవడం సందేహంగానే ఉంది. ఇక ‘అల వైకుంఠపురములో’ సినిమాకి రెండో వీక్‌లోనూ కలెక్షన్స్ దూసుకుపోవడమే కాదు.. 2.5 మిలియన్ మార్కును కూడా ఈజీగా దాటేసేలా కనిపిస్తోంది అంటున్నారు. త్రివిక్రమ్ మాయ, అల్లు అర్జున్ కత్తిలాంటి స్టయిల్ అన్ని అల వైకుంఠపురములో కలెక్షన్స్‌కి ఫుల్ సపోర్ట్ చేయడం, త్రివిక్రమ్‌కి ఓవర్సీస్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉండడంతో అల వైకుంఠపురములో అలా అలా దూసుకుపోతుంది. ఇక యుఎస్‌లో హైయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిన త్రివిక్రమ్ సినిమా ‘అఆ’ని బీట్ చేసి అల వైకుంఠపురములో దూసుకుపోవడం మాత్రం పక్కాగా కనబడుతుంది. 

Ala Vaikunthapurramloo Biggest Hit in Overseas:

Sankranthi Movies: Ala Vaikunthapurramloo Beats Sarileru Neekevvaru
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs