Advertisement
Google Ads BL

ప్రభాస్ కొత్త సినిమాకు మళ్లీ బ్రేక్.. కారణమిదే?


ప్రభాస్ సాహో తర్వాత భారీ గ్యాప్ తీసుకుని.. రాధాకృష్ణ మూవీ కోసం రెడీ అవడం.. ఆ సినిమా కూడా మొదలవడం జరిగింది. రాధాకృష్ణ సినిమా షూటింగ్ కొంతమేర జరిగినప్పటికీ.. సాహో రిజల్ట్ తర్వాత ప్రభాస్ ఆ సినిమాలో కొన్ని మార్పులు సూచించడంతో... ఆ సినిమా షూటింగ్‌ని నిన్నటివరకు ఆపేసారు. అయితే కొత్తగా లుక్‌తో పాటుగా సినిమా షూటింగ్ మళ్లీ మొదలెట్టబోతున్నట్టుగా చెప్పారు. అలాగే షూటింగ్ కూడా అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో మొదలయ్యింది. కానీ మళ్ళీ షూటింగ్‌కి బ్రేకొచ్చింది. కారణం ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే.

Advertisement
CJ Advs

పూజా హెగ్డే అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్టందుకుంది. అయితే ఆ సినిమాతో పాటు ఒప్పుకున్న అఖిల్ సినిమా షూటింగ్, అలాగే అల వైకుంఠపురములో ప్రమోషన్స్‌తో బిజీగా ఉండడంతో రెస్ట్ లేకపోవడంతో.. పూజా అనారోగ్యం పాలయిందట. అందుకే ప్రస్తుతం ప్రభాస్ సినిమా షూటింగ్‌లో పాల్గొనలేకపోతుంది. అసలే ఆరు నెలల షూటింగ్‌కి బ్రేక్‌తో ఎలాగోలా మళ్ళీ పట్టాలెక్కిన ప్రభాస్ సినిమా ఇప్పుడు పూజమ్మ అనారోగ్యంతో మరోసారి వాయిదా పడింది. 

ఈ షెడ్యూల్ పూజా - ప్రభాస్‌ల మీద చిత్రీకరించాల్సి ఉండడంతో.. దర్శకుడు కూడా చేసేదేమీ లేక రొమాంటిక్ ఎపిసోడ్ పక్కనబెట్టి మరో కొత్త ఎపిసోడ్‌కి ప్లాన్ చేస్తున్నాడట. మరి ప్రభాస్ - రాధాకృష్ణ మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ సెట్ కూడా మారబోతుందని తెలుస్తుంది. మళ్ళీ ఇవన్నీ సెట్ అయ్యేవరకు కొద్దిగా టైం పట్టేలా ఉందంటున్నారు. అలాగే టైటిల్ విషయంలోనూ టీం ఇంకా కొలిక్కి రాకపోవడంతోనే... లుక్‌తో పాటుగా టైటిల్ ఎనౌన్స్ చెయ్యలేదని చెబుతున్నారు. తాజా పరిణామాలతో ఇక ప్రభాస్ కొత్త సినిమా ఈ ఏడాది విడుదల కాకపోవచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 

Prabhas, Radhakrishna Film: Again Postponed:

Pooja Hegde Reason for Prabhas Film Postponement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs