Advertisement
Google Ads BL

ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిస్’ ఫస్ట్ లుక్


ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిస్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Advertisement
CJ Advs

తెలుగు కథ, కథనాలు రియాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే ‘మిస్టర్ అండ్ మిస్’ డేటింగ్ లు, వీడియో చాటింగ్ లు ప్రేమలో భాగం అయిన ఈ జనరేషన్ ప్రేమకథగా ‘మిస్టర్ అండ్ మిస్’ రూపొందింది. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు తగ్గట్టుగానే కొత్తగా వస్తోన్న మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అలా ఇప్పుడు మిస్టర్ అండ్ మిసెస్ అంటూ ఓ సినిమా రాబోతోంది. క్రౌడ్ ఫండెడ్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రాన్ని అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్నాడు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ: ‘‘ఇది ఈ జనరేషన్ ప్రేమకథ, ఒక ఇండిపెండెంట్ అమ్మాయి కథ, హీరో క్యారెక్టర్ తో నేటి యువతరం బాగా రిలేట్ అవుతుంది. ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు, ముంబైకి చెందిన మోడ్రన్ యువతి లివింగ్ రిలేషన్ లో ఉంటారు. ఈ కథలో ఈ జంటలో ఒకరి మొబైల్ మిస్ అవుతుంది. ఆ మొబైల్ లో ఏముంది.. మిస్ అయిన మొబైల్ వీరి జీవితాలలో ఎలాంటి మార్పులను తెచ్చింది..?  యూత్ రిలేట్ అయ్యే కంటెంట్ తో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ మూవీ లుక్ ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘మిస్టర్ అండ్ మిస్’ టీం రిలీజ్ చేసిన ఈ లుక్ కి మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర పనులలో  ఉన్న ఈ చిత్రంలో జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటిస్తున్నారు. పూర్తిగా క్రౌడ్ ఫండెడ్ మూవీగా వస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : కార్తిక్ కట్స్, పాటలు: పవన్ రాచేపల్లి, కాస్ట్యూమ్ డిజైనర్ : సహస్ర రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ : కరీష్ కుమార్, లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ సాగి, సినిమాటోగ్రఫీ : సిద్ధం మనోహర్, సంగీతం : యశ్వంత్ నాగ్, పి.ఆర్.ఓ : జి.ఎస్.కె మీడియా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : సుధీర్ వర్మ పెరిచర్ల, నిర్మాణం : క్రౌడ్ ఫండెడ్, కథ, దర్శకత్వం : అశోక్ రెడ్డి.

Mister and Miss First Look Released:

Superb Response to Mister and Miss First Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs