Advertisement
Google Ads BL

బన్నీ-సుక్కు ఫిల్మ్ టైటిల్ ఫిక్సయిందా?


అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’... సూపర్ హిట్ కొట్టి.. ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. విజయోత్సవాలు, సక్సెస్ సెలబ్రేషన్స్ అంటూ హడావిడి చేస్తున్నాడు. ఇక ‘అల వైకుంఠపురములో’ ముచ్చట్లు ముగిసాక.. సుకుమార్ తో కొత్త సినిమా కోసం రెడీ అవుతాడు. ఇప్పటికే సుకుమార్ కొద్దిపాటి షూటింగ్ ని చిత్రీకరించి బన్నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎర్రచందనం నేపథ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడు. హీరోయిన్ రష్మిక కూడా డి గ్లామరస్ గా కనబడనుంది. ఇక తాజాగా మొదలు కాబోయే షెడ్యూల్ కల్లా అల్లు అర్జున్ న్యూ లుక్ లోకి మారబోతున్నాడు.

Advertisement
CJ Advs

అయితే సుకుమార్ - బన్నీ కొత్త సినిమా విషయంలో ఓ ఆసక్తికర టైటిల్ ఒకటి ప్రచారంలోకొచ్చింది. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమా నాలుగు టైటిల్స్ ని అనుకోవడమే కాకుండా రాసి పెట్టుకున్నాడని.. సుకుమార్ టైటిల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి గనక.. ఈ సినిమా టైటిల్ కూడా కాస్త వెరైటీగా ఉండబోతుందని అంటున్నారు. సినిమా మొత్తం శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లిమ్ మీద సాగుతుంది కాబట్టి.. ఈ సినిమాకి ‘శేషాచ‌లం’ అనే ఓ టైటిల్ ని సుకుమార్ అనుకున్నట్లుగా టాక్. మరి గతంలోనూ రామ్ చరణ్ సినిమా కోసం ‘రంగస్థలం’ అనే ఊరి పేరుతో టైటిల్ పెట్టి.. టైటిల్ తోనే మ్యాజిక్ చేసిన సుకుమార్ ఇప్పుడు బన్నీ సినిమా కోసం ‘శేషాచ‌లం’ అనే టైటిల్ పెడితే బావుంటుంది అని అనుకుంటున్నాడట. మరి మిగతా మూడు ఏమిటనేది ఇంకా తెలియదు కానీ... ఫైనల్ గా బన్నీ - సుక్కు సినిమా టైటిల్ ‘శేషాచ‌లం’ అయినా అవ్వొచ్చని అంటున్నారు.

Rumours on Allu Arjun and Sukumar Movie Title:

Seshachalam is the Allu Arjun and Sukumar Movie Title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs